టెన్షన్ లో శ్రీనువైట్ల..

ఉంటుంది.. ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది.. ఒకటి రెండు కాదు మూడు డిజాస్టర్లు.. ఆపై ఏడాది ఆగితే కానీ రాని అవకాశం.. నమ్మని హీరోలు.. పక్కకి రానివ్వని నిర్మాతలు.. ఇలా చాలా కష్టపడ్డాడు శీనువైట్ల. ఇన్ని చేస్తే కానీ అమర్ అక్బర్ ఆంటోనీ అవకాశం రాలేదు. ఏడాది పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందో అని టెన్షన్ పడుతున్నాడు శీనువైట్ల. అసలు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా.. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిస్థితి ఏంటో అని ఓ రేంజ్ లో కంగారు పడుతున్నాడు వైట్ల. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా.. ఎప్పుడెప్పుడు టాక్ బయటికి వస్తుందా అని చూస్తున్నాడు శీనువైట్ల. ఆగడుతో ఈయన ఫ్లాపుల యాత్ర మొదలైంది.. ఆ తర్వాత బ్రూస్లీ, మిస్టర్ తో హ్యాట్రిక్ పడింది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ కు ముహూర్తం పెట్టకుండా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు శీనువైట్ల. మరి ఈయన ఆశ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం ఎంతవరకు తీరుస్తుందో.. మళ్లీ శీనువైట్ల హిట్ కొడతాడో లేదో.. ఇవన్నీ మరికొన్ని గంటల్లోనే తేలనుంది. కానీ ఇప్పటినుంచి సినిమా విడుదలయ్యే క్షణం వరకు మాత్రం ప్రతీ నిమిషం ఓ యుగంతోనే ఈ దర్శకుడికి సమానం ఇప్పుడు.