మహేష్ కొత్త బిజినెస్ రజినీకాంత్ బొమ్మతో స్టార్ట్

మన సూపర్ స్టార్ కోసం ఇప్పుడు ఆల్ ఇండియన్ సూపర్ స్టార్ వస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు కోసం ఇప్పుడు రజినీ వస్తాడనే ప్రచారం జరుగుతుంది. మహేష్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు.. బిజినెస్ మ్యాన్ కూడా. ఇప్పటి వరకు తనకు సినిమాలు తప్ప మరో ప్రపంచం లేదని చెప్పిన మహేష్.. ఇప్పుడు ఒక్కొక్కటిగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే ఏషియన్ ఫిల్మ్ ఓనర్ సునీల్ నారంగ్ తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నాడు సూపర్ స్టార్. ఇప్పుడు మల్టీప్లెక్సులకు ఉన్న ఆదరణ చూసిన మహేష్.. ఇందులో 150 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది.
గచ్చిబౌలి ఓపెన్ స్థలాల్లో ఈ మల్టీప్లెక్సుల నిర్మాణం పూర్తైంది కూడా. ఏడు స్క్రీన్లతో 3డి టెక్నాలజీ.. డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్స్ తో 1638 సీటింగ్ ఉండేలా ఈ మల్టీప్లెక్స్ ముస్తాబైంది. ముందు దీన్ని నవంబర్ 8న అమీర్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతోనే ఓపెన్ చేయాలనుకున్నా కూడా అప్పుడు అమీర్ రాకపోవడంతో పెద్ద డిజాస్టర్ నుంచి మహేష్ థియేటర్స్ తప్పించుకుంది. అయితే ఇప్పుడు రజినీకాంత్ 2.0తో ఈ థియేటర్స్ ఓపెన్ కానున్నాయి. దీనికి రజినీకాంత్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా వస్తున్నాడు. ఇంత ఖర్చు చేసి నిర్మించిన మల్టీప్లెక్స్ ఫ్లాప్ సినిమాతో ఓపెన్ అయివుంటే ఖచ్చితంగా ఫీలయ్యే వాడు మహేష్ బాబు. అందుకే ఆయన రాలేదు.. ఈయన బతికిపోయాడు.
ఇప్పుడు 2.0తో ఓపెన్ చేసి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు మల్టీప్లెక్సులే కాదు.. కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే తాను చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇందులోనే ఓ టాప్ కంపెనీతో కలిసి టై అప్ అవుతున్నాడు మహేష్. ఇందులో మహేష్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు బిజినెస్ లతో పాటు మరికొన్ని బిజినెస్ లపై కూడా మహేష్, నమ్రతా శిరోద్కర్ కన్నేసినట్లు సమాచారం. మొత్తానికి ఓ వైపు సినిమా రంగంలో సూపర్ స్టార్ గా వెలిగిపోతూనే.. మరోవైపు బిజినెస్ లోనూ దుమ్ము దులిపేయాలని చూస్తున్నాడు మహేష్ బాబు.