English   

అప్పుడు పవన్.. ఇప్పుడు రవితేజ

Flop Director Missed Chance to Work With Pawan Kalyan and Ravi Teja
2018-11-16 08:14:42

అనుకున్నది ఒక్కటీ అయినది ఒక్కటీ అన్నట్టుగా అయింది సంతోష్ శ్రీనివాస్ పరిస్థితి. ఇంకా విషాదం ఏంటంటే ఇప్పుడు అయింది అనుకున్నది కూడా పోయింది. అతను ఫస్ట్ మూవీ ‘కందిరీగ’తో అప్పటి ట్రెండ్ కు అనుగుణంగా హిట్ కొట్టాడు. కానీ ఆ ట్రెండ్ పై ఆడియన్స్ లో బోరింగ్ వచ్చినా.. మరోసారి రభస చేశాడు. బట్ ఈ సారి బాగా దెబ్బకొట్టింది. కందిరీగ హీరో రామ్ ఇచ్చిన అవకాశం కూడా హైపర్ ఎక్కువై కొట్టుకుపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ లో కలిశాడు. ఒక సినిమాకు దర్శకత్వ ఛాన్స్ ఇస్తానని చెప్పాడు పవన్. కోలీవుడ్ లో హిట్ అయిన తెరి మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకుని కథనం (తెలుగుకు అనుగుణంగా) మొదలుపెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఆ కథను రవితేజకు చెప్పాడు. అప్పుడు ఫ్లాపుల్లో (ఇప్పుడూ అనుకోండి) ఉన్న మాస్ రాజా వెంటనే ఓకే చెప్పాడు. ఇంకేముందీ ఈ కథ రవితేజకైతే ఇంకా బావుంటుందని అతనికి అనుగుణంగా మార్పులు మొదలుపెట్టాడు. కట్ చేస్తే ఇప్పుడు రవితేజ ఆ సినిమా చేయను అని చెప్పాడట.

నిజానికి అమర్ అక్బర్ ఆంటోనీ తర్వాత రవితేజ ఈ సినిమా మొదలుపెట్టాలి. దీంతో పాటుగా విఐ ఆనంద్ డైరెక్షన్ లోనూ సినిమా ఉంది. ఈ రెండూ ఒకేసారి చేయాలనుకున్నాడు. కానీ ఎందుకో.. శ్రీనివాస్ కు నో చెప్పాడట. ఇందుకు కారణాలేంటనేది కరెక్ట్ గా తెలియదు కానీ.. మొత్తంగా సంతోష్ శ్రీనివాస్ ఆశలు  ఆవిరయ్యాయి. విశేషం ఏంటంటే.. సంతోష్ కు మైత్రీ మూవీస్ వాళ్లు బ్యాక్ రోల్ గా నిలిచారు. అయినా రవితేజ ఎందుకు నో చెప్పాడన్నది తెలియడం లేదు. పైగా తెరి సినిమా తెలుగులోనూ పోలీస్ గా వచ్చింది. అందుకే సంతోష్ ఆ ఛాయలను దాటి ఇంకాస్త బెటర్ గానే రాశాడట. అయినా రవితేజ కాదన్నాడు. దీంతో ఇప్పుడు మరో హీరోను వెదుక్కునే పనిలో పడ్డాడు సంతోష్ శ్రీనివాస్. ఏదేమైనా సంతోష్ పరిస్థితి చూసి ఇప్పుడు చాలామంది పాపం సంతోష్ శ్రీనివాస్ అనుకుంటున్నారట.

More Related Stories