English   

టాక్సీవాలా ప్రీమియర్ షో టాక్ వచ్చేసింది

Vijay Devarakonda’s Taxiwaala Premier Show Talk
2018-11-17 08:20:40

కొన్నిసార్లు మ‌నం అనుకుంటున్నట్లు కాకుండా కొన్ని సినిమాల‌కు మ‌రో టాక్ వ‌స్తుంది. ఇప్పుడు టాక్సీవాలా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఈ చిత్రం చాలా వాయిదాల త‌ర్వాత ఇప్పుడు విడుద‌లైంది. ఓవ‌ర్సీస్ టాక్ కూడా ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చేసింది. ఈ చిత్రంపై నిజానికి ఎవ‌రికీ న‌మ్మ‌కాలు కానీ.. అంచ‌నాలు కానీ లేవు. కానీ ఇప్పుడు టాక్ మాత్రం ప‌ర్లేదు అని వ‌చ్చింది. ముఖ్యంగా కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయంటున్నారు. ఓవ‌ర్సీస్ ఆడియ‌న్స్ ఈ చిత్రానికి మంచి సినిమా అనే చెబుతున్నారు.

ఫ‌స్టాఫ్ అంతా కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని.. అయితే సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా గాడి త‌ప్పింద‌ని అంటున్నారు. అది కానీ వ‌ర్క‌వుట్ అయ్యుంటే విజ‌య్ కెరీర్ లో మ‌రో హిట్ ప‌డేదంటున్నారు ఆడియ‌న్స్. ఇప్ప‌టికైనా కామెడీ సీన్స్.. అక్క‌డ‌క్క‌డా హార్ర‌ర్ తో సినిమా ఈజీగా బ‌య‌ట ప‌డుతుంద‌ని ధీమాగానే చెబుతున్నారు ప్రేక్ష‌కులు. ఖచ్చితంగా హార్ర‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డేవాళ్ల‌కు టాక్సీవాలా న‌చ్చుతుంద‌ని వాళ్లంటున్నారు. ఏ మాత్రం అంచ‌నాలు లేకుండా విడుద‌లైన టాక్సీవాలాకు ఇలాంటి టాక్ రావ‌డం ఆశ్చ‌ర్య‌మే. మ‌రి చూడాలిక‌.. ఇక్క‌డ టాక్సీవాలా ఎలాంటి టాక్ తో రానుందో..?

More Related Stories