English   

ఆ డైరెక్టర్ కు హీరోలు కావలెను

Sensational Hit RX 100 Movie Director Ajay Bhupathi Wants Heroes for Next
2018-11-17 18:38:48

ఒక్క సినిమాతో ఫేట్ మార్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. రియలిస్టిక్ స్టోరీని అంతే రియలిస్టిక్ గా సినిమాను చిత్రీకరించి హిట్ నూ కొట్టిన తెలివైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడుగా వచ్చినా.. మొదటి సినిమాతోనే తన ముద్రను వర్మ కు దూరంగా వేయగలిగాడు. టేకింగ్ లో కొంత కనిపించినా కథ, కథనాల్లో అవేవీ లేకుండా చూసుకున్నాడు. మొత్తంగా ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన అజయ్ కోసం చాలామంది నిర్మాతలు కర్చీఫ్ లు వేశారు. ఓదశలో తమిళ్ స్టార్ హీరో ధనుష్ కూడా చెన్నై పిలిపించి మంచి కథ చూడమని చెప్పాడు(ఇది నిజం). ఆ స్థాయిలో పేరొచ్చిందా సినిమాకు. ఆ పేరుతో తను అర్జెంట్ గా ఓ ఇంటివాడయ్యాడు. పెళ్లి తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే మరో సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఈ కథ తన వద్ద ఉన్నదే. అయితే దాన్ని పూర్తిస్థాయి స్క్రిప్ట్ గా మార్చాడు. ఇప్పుడు ఆ కథను బౌండ్ స్క్రిప్ట్ గా మార్చి రెడీగా ఉన్నాడు. నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. బట్ హీరోలు లేరు.

యస్.. మీరు చదివింది కరెక్టే.. అజయ్ భూపతి కథకు హీరోలు లేరు. అయితే ఇదో మల్టీస్టారర్ కథట. తను అనుకున్న హీరోలకు ఇప్పటికే ఈ కథ వినిపించాడని టాక్. అయితే ఆ మధ్య హీరో రామ్, మళయాల స్టార్ దుల్కర్ సాల్మన్ నటిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి నిజం కాదని ఖండించాడు అజయ్. అయితే ఈ కథలో ముగ్గురు హీరోలుంటారని టాక్. మరి ఆ ముగ్గురెవరు.. ఇప్పుడు మీడియం రేంజ్ స్టార్స్ అంతా చాలా బిజీగా ఉన్నారు. వారికి అజయ్ కథ నచ్చినా ఇప్పటికిప్పుడే డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే అజయ్ మరికొంత కాలం ఆగాల్సి ఉంటుంది. కానీ ఏదైనా వేడిమీద ఉన్నప్పుడే లాగించేయాలి. లేదంటే ఈ హిట్ ను ఇండస్ట్రీ మర్చిపోవడానికి ఎక్కువ టైమ్ పట్టదు.

More Related Stories