English   

మాట నిల‌బెట్టుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Devarakonda Proved Once Again With Taxiwala
2018-11-18 21:12:25

ఏం మాటిచ్చాడు.. ఏం నిల‌బెట్టుకుంటున్నాడు అనుకుంటున్నారా..? ఆ మ‌ధ్య నోటా ఫ్లాప్ త‌ర్వాత అభిమానుల‌కు ఓ లేఖ రాసాడు విజ‌య్. నాకు ఫ్లాప్ రావాల‌ని చాలా మంది కోరుకున్నారు వ‌చ్చింది పండ‌గ చేసుకోండి.. మ‌ళ్లీ ఆ త‌ర్వాత ఛాన్స్ రాద‌ని.. ఇప్పుడు నిజంగానే టాక్సీవాలా వ‌చ్చింది ఈ చిత్రం టాక్ బాగానే తెచ్చుకుంది. అస‌లు అంచ‌నాలు లేని సినిమా కాస్తా ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కుమ్మేస్తుంది. నేను ట్రెండ్ ఫాలో అవ్వ‌ను.. ట్రెండ్ సెట్ చేస్తానంటూ గ‌బ్బ‌ర్ సింగ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పిన డైలాగులు ఆయ‌న పాటించాడో లేదో కానీ ఇప్పుడు విజ‌య్ దేర‌వ‌కొండ మాత్రం ప‌క్కాగా ఫాలో అవుతున్నాడు. ఈయన సినిమా సినిమాకు పిచ్చెక్కించేలా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా క‌థ‌ల ఎంపిక‌లో ఈ త‌రం హీరోలు చాలా మంది క‌నీసం చూడ‌ని వాటి వైపు వెళ్తున్నాడు. ఇదే మ‌నోన్ని సూప‌ర్ స్టార్ గా మార్చేస్తుంది. యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న క‌థ‌ల వైపు అడుగేస్తున్నాడు ఈ కుర్ర హీరో.

పెళ్లిచూపులులో ఆవారా కుర్రాడు.. అర్జున్ రెడ్డిలో ఆర‌గెంట్ రోల్.. గీత‌గోవిందంలో ప‌క్కింటి అబ్బాయిగా సంస్కార‌వంత‌మైన ల‌వ‌ర్ బాయ్.. నోటాలో రాజ‌కీయ నాయ‌కుడు.. ఇప్పుడు టాక్సీవాలాలో డ్రైవ‌ర్.. ఇలా ఒక్కో పాత్ర‌లో ర‌చ్చ చేస్తున్నాడు విజ‌య్. ఇప్పుడు టాక్సీవాలా చూసిన త‌ర్వాత విజ‌య్ మ‌రోసారి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోయాడు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ రావ‌డం ఖాయం అయిపోయింది. త‌న‌కు హిట్ లేద‌ని ఫీల్ అయిన రెండు నెల‌ల్లోనే మ‌రో హిట్ కొట్టి చూపించాడు విజ‌య్. ఈయ‌న న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ప్రేక్ష‌కులు కూడా విజ‌య్ సినిమాల‌కు ప‌డిపోతున్నారు. ముఖ్యంగా కుర్రాళ్లు అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ స్క్రీన్ పై క‌న‌బ‌డితే ర‌చ్చ చేస్తున్నారు. రాబోయే క్రాంతిమాధవ్ సినిమా కూడా క‌చ్చితంగా బాగుంటుంద‌ని ధీమాగా చెబుతున్నాడు ఈ కుర్ర హీరో. ఏదేమైనా తాను హిట్ కొడ‌తా చూసుకోండి అంటూ చెప్పి మ‌రీ కొట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

More Related Stories