English   

ఆర్ఆర్ఆర్ షూటింగ్ స్టార్ట్

RRR-Shooting
2018-11-19 11:46:25

రాజమౌళి దర్శకత్వంలో రామారావు, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’ షూటింగ్ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతోంది. సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడో వచ్చేసింది. అప్పటి నుంచి సాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇక ఈ నెల 11న అఫీషియల్  గా ప్రారంభోత్సవం కూడా జరుపుకున్న ఈ మూవీ ప్రొడక్షన్ మొదలైంది.. మామూలుగా తన సినిమాల ప్రారంభ రోజునే కథ గురించి క్లూ ఇచ్చే రాజమౌళి ఈ సారి ఆ విషయాన్ని ఆడియన్స్ ఊహలకే వదిలేశాడు. ఇదికాస్త ఆశ్చర్యం  కలిగించినా బాహుబలిలాగా ఈ సినిమాపైనా రకరకాల ఊహాగానాలు వస్తూ రెగ్యులర్ గా ఆడియన్స్ లో ఉండేందుకే జక్కన్న అలాంటి స్ట్రాటజీ చేసినట్టు అర్థమవుతోంది. 

మొత్తంగా డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన బలంగా వినిపిస్తోన్న వార్త ఏంటంటే..  ఇది 1920ల నేపథ్యంలో నడిచే కథ అంటున్నారు. అందుకే ఇద్దరు హీరోల మేకోవర్ కు సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వీరి మేకోవర్ కు సంబంధించి ఎక్స్ పర్ట్ వర్క్ మొదలైంది. ఇక సినిమాను క్లైమాక్స్ చిత్రీకరణతో మొదలుపెట్టాడు రాజమౌళి. ఇందుకోసం ఏకంగా 40 రోజుల భారీషెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ 40 రోజులు తనూ సెట్ లోనే ఉండేలా తనకూ ఓ ఇల్లు సెట్ వేయించుకున్నాడు. మొత్తంగా ఇవాల్టి నుంచి ప్రారంభవుతోన్న షూటింగ్ లో ముందుగా ఎన్టీఆర్ తో కొన్ని సీన్స్ చిత్రీకరిస్తారని టాక్.. 

More Related Stories