English   

టాక్సీవాలా.. బ్లాక్ బ‌స్ట‌ర్ రైడ్ అయ్యేలా ఉందిగా.. 

Taxiwala
2018-11-19 12:34:52

ల‌క్ అంటే ఇలా ఉండాలి.. న‌క్క‌లు ఎక్క‌డున్నా వ‌చ్చి త‌మ తోక‌లు తొక్కాలంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ముందు నించుటున్నాయిప్పుడు. మ‌నోడి సుడి చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. అస‌లు టాక్సీవాలా అనే ఓ సినిమా ఉంద‌ని.. దానిపై కూడా అంచ‌నాలు ఉన్నాయ‌ని.. ఆస‌క్తి ఇంకా ఉంద‌ని అనుకోలేదెవ్వ‌రూ. ఎందుకో తెలియ‌దు కానీ ఓ ర‌క‌మైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంటుంది. టాక్సీవాలా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. అయితే ఇప్పుడు ఇది త‌ప్ప‌ద‌ని ప్రూవ్ అయింది. అస‌లే ఇప్పుడు విజ‌య్ సినిమా అంటే కుర్రాళ్ల‌కు బాగా పిచ్చి. నోటా ఫ్లాప్ అయినా కూడా విజ‌య్ మాత్రం స‌క్సెస్ అయ్యాడు. ఇప్పుడు టాక్సీవాలా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుని క‌లెక్ష‌న్ వైపు దూసుకుపోతుంది. 

బ్లాక్ బ‌స్ట‌ర్ రైడ్ అయ్యేలా క‌నిపిస్తుంది. ఎలాగూ ఇప్పుడు మ‌రో సినిమాలు కూడా లేవు కాబ‌ట్టి అంద‌రికీ టాక్సీ ఎక్క‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోతుంది. టాక్సీవాలాను సొంత రిలీజ్ చేసుకున్నారు గీతాఆర్ట్స్. దాంతో తొలిరోజు నుంచే వ‌చ్చేదంతా వాళ్ల‌కు లాభాలే. ఎందుకంటే ఇప్ప‌టికే రైట్స్ రూపంలో బ‌డ్జెట్ తో పాటు లాభాలు కూడా వ‌చ్చాయి. ఇప్పుడు క‌లెక్ష‌న్స్ కూడా అలాగే వ‌స్తున్నాయి. ముందు ఈ చిత్రంపై ఉన్న అంచ‌నాల‌కు తొలిరోజే 2 కోట్లు వ‌స్తే ఎక్కువ అనుకున్నారు కానీ ఇప్పుడు తొలిరోజే 4.5 కోట్ల షేర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ తో ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ రైడ్ గా మారిపోతుంది. ఏమో చూడాలిక‌.. ఈ చిత్రం ఎక్క‌డొచ్చి ఆగిపోతుందో..? 

More Related Stories