English   

‘సాహో’ రిలీజ్ డేట్ చెప్పారహో..

Saaho
2018-11-19 12:58:32

రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. బాహుబలి రేంజ్ లో ఈ మూవీకి కూడా లాంగ్ టైమ్ తీసుకుంటున్నాడు ప్రభాస్. ఇప్పటికే యేడాదిన్నరకు పైగా షూటింగ్ లో కొనసాగుతోన్న ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేదానిపై ఇప్పటి వరకూ ఎవరికీ క్లారిటీ లేదు. పైగా స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉంది. ఇక ఈ మూవీతో బాలీవుడ్ లో పర్మినెంట్ మార్కెట్ కోసం ట్రై చేస్తున్నాడు ప్రభాస్. అందుకే సాహోలో ఎక్కువగా అక్కడి నటులే ఉన్నారు. హీరోయిన్ గా శ్రద్దాకపూర్ నటిస్తుండగా ఇతరకీలక పాత్రల్లోనూ బాలీవుడ్ వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అందుకే. హాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ ను గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయంటున్నారు. కథ, కథనాలు కూడా ఆ స్థాయిలో ఉంటాయట. ఇక ఇప్పటికే ప్రభాస్ నుంచి సినిమా జానర్, టీజర్, కనీసం రిలీజ్ డేట్ వంటి ఏదైనా క్లారిటీ వస్తుందని ఇన్నాళ్లూ ఎదురు చూసిన అభిమానులకు ఫైనల్ గా స్వీట్ న్యూస్ చెప్పాడీ డార్లింగ్. అయితే న్యూస్ స్వీట్ అయినా డేట్ డిజప్పాయింట్ చేసేలా ఉంది. ఇప్పటి వరకూ అంతా అనుకున్నది ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదలవుతుందని.. కానీ సమ్మర్ లో రావడం సాధ్యం కావడం లేదట. అందుకే నెక్ట్స్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకు విడుదల చేస్తున్నట్టు సమాచారం. సో.. సాహో 2019 ఆగస్ట్ 15న విడుదల కాబోతోందన్నమాట.. 

More Related Stories