English   

పాపం ఇలియానా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేసారుగా.. 

Ileana
2018-11-19 17:54:43

ఆరేళ్ల త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఈ చిత్రంలో చూస్తుంటే అమ్మ‌డు ఫుల్లుగా కండ ప‌ట్టేసి క‌నిపించింది. పైగా ఇప్పుడు బ‌య‌ట చూస్తుంటే అస‌లు మ‌నం చూసిన ఇలియానా ఈమేనా అనే అనుమానం వ‌స్తుందిప్పుడు. అంత‌గా బ‌రువు పెరిగిపోయింది. ఒక‌ప్పుడు న‌డుము మాత్రమే క‌నిపించేది కానీ ఇప్పుడు ఫ్యాట్ అండ్ సెక్సీగా ఒళ్లంతా సెగలు పుట్టిస్తుంది. ఆరేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ సౌత్ కు వ‌స్తున్నా కూడా మ‌రోసారి అదే రాణివాసం ఇచ్చారు మ‌న నిర్మాత‌లు. అయితే ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ డిజాస్ట‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ అమ్మాయిగారికి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఈ సినిమా కోసం ఇలియానాకు ఏకంగా 2 కోట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు మ‌రో అవ‌కాశం ఇవ్వ‌డం కూడా గ‌గ‌నం అయిపోతుంది. ఇన్నాళ్లూ టాలీవుడ్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోని ఇలియానా.. ఇప్పుడు ఫోటోషూట్ల‌తో త‌న ఆగ‌మ‌నాన్ని చాటుతుంది.
 
వ‌స్తున్నా చూసుకోండి అన్న‌ట్లు కొత్త ఫోటోల‌తో సంద‌డి చేస్తుంది. బాలీవుడ్ లో ఎంత రెచ్చిపోయినా ఒక్క ఆఫ‌ర్ కూడా రావ‌డం లేదు. గ‌త ఏడాది బాద్ షాహోలో ఏకంగా న్యూడ్ గా న‌టించింది ఇలియానా. ఓ స‌న్నివేశం కోసం అజ‌య్ దేవ్ గ‌న్ ముందు న్యూడ్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సినిమాలో ముద్దులు.. హాట్ సీన్ల‌తో రెచ్చిపోయింది ఈ జ‌ఘ‌న సుంద‌రి. ఇంత చేసినా కూడా అక్క‌డ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. తెలుగులోనూ ఇప్పుడు ఇదే ప‌రిస్థితి. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఫ్లాప్ త‌ర్వాత ఇలియానా వైపు చూడ్డానికి కూడా ఆలోచిస్తున్నారు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు. పైగా ఇప్పుడు ఏ హీరో కూడా ఇలియానాతో న‌టించ‌డానికి ఉత్సాహం చూపించ‌డం లేదు. దాంతో బాలీవుడ్ లో ఉండ‌లేక‌.. టాలీవుడ్ ను వ‌ద‌ల్లేక ఎటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? 

More Related Stories