English   

ట్రిపుల్ ఆర్ తో స‌ల్మాన్ ఖాన్ సంబంధాలు.. 

RRR-Movie
2018-11-19 18:50:18

ఇప్పుడు ఇండియ‌న్ సినిమా అంతా క‌లిపి మాట్లాడుకుంటున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఒక్క‌రుంటేనే బిజినెస్ 100కోట్లు దాటేస్తున్న ఈ స‌మ‌యంలో ట్రిపుల్ ఆర్ బిజినెస్ మాత్రం ఏకంగా 500 కోట్లు దాటిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా బిత్త‌ర‌పోయేలా మ‌న సినిమా స్థాయిని పెంచేస్తున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. ఇక ఇప్పుడు ఇందులో విల‌న్ పాత్ర కోసం స‌ల్మాన్ ఖాన్ కూడా ట్రై చేస్తున్నాడు. అయితే ఆయ‌న మాత్రం కాదులెండీ.. కానీ ఆయ‌న బామ్మ‌ర్ది ఆయుశ్ శ‌ర్మ ఈ చిత్రంతో తెలుగులో న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. విల‌న్ పాత్ర కోసం ఈయ‌న్నే తీసుకోవాల‌ని స‌ల్మాన్ రాయ‌బారం న‌డుపుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. పైగా రాజ‌మౌళి కొడుకు కార్తికేయ‌కు ఆయుశ్ శ‌ర్మ స్నేహితుడు కావ‌డం విశేషం. లవ్ యాత్రి సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ఆయుశ్. 

చూడ్డానికి స్టైలిష్ గా ఉండే ఆయుష్ శ‌ర్మ‌కు విల‌న్ కు కావాల్సిన బాడీ షేప్ ఉంది. దాంతో ఇప్పుడు ఈ కుర్రాడి వైపు రాజ‌మౌళి చూపులు ప‌డుతున్నాయి. పైగా ఆర్ ఆర్ ఆర్ ప్రారంభోత్సవ వేడుక‌కు ఆయుశ్ కూడా వ‌చ్చాడు. కాక‌పోతే ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. ఈయ‌న వ‌చ్చాడంటే సినిమాలో ఉన్నాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ తో దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజ‌మౌళి రెమ్యున‌రేష‌న్ దాదాపు 100 కోట్ల వ‌ర‌కు షేర్ ఉంటుంద‌ని తెలుస్తుంది. ఇక మిగిలిన ఇద్ద‌రు హీరోలు కూడా భారీగానే తీసుకుంటున్నారు. బిజినెస్ కూడా ఇప్పుడే 600 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతుంది. మొత్తానికి స‌ల్మాన్ బామ్మ‌ర్ది రాజ‌మౌళి సినిమాలో ఉంటాడో లేదో కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. 

More Related Stories