English   

సిద్ధమ్మగా నయనతార 

Nayanthara
2018-11-19 19:06:22

నయనతార.. ఈ దశాబ్ధంలో దక్షిణాదిలో అనేక సంచలనాలకు కారణమైన నటి. పర్సనల్ లైఫ్ లో ఎత్తుపల్లాలున్నా.. ప్రొఫెషనల్ గా ఎదిగిందే తప్ప ఎప్పుడూ తడబాటుకు గురి కాలేదు. నయన్ కెరీర్ లో ఉన్న మలుపులు సినిమాల్లోనైనా ఉంటాయా అనేది డౌటే. సౌత్ లో రెండుసార్లు బ్రేకప్ అయిన ఫస్ట్ హీరోయిన్. ప్రతి బ్రేకప్ తర్వాత రెట్టించిన వేగంతో కెరీర్ ను స్పీడప్ చేసుకున్న ఫస్ట్ హీరోయిన్ నయనతారే. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని ఫామ్ లో ఉన్న నయనతార బర్త్ డే ఇవాళ. 

అత్యంత సాధారణంగా కెరీర్ మొదలుపెట్టి అసాధారణమైన ప్రయాణంలో ఇప్పుడు హీరోలకే సవాల్ విసిరేంతగా ఎదిగిన నటి నయనతార. మళయాలంలో మొదలుపెట్టి తమిళంలో అడుగుపెట్టి తెలుగులో హిట్స్ కొట్టి.. మొత్తంగా సౌత్ క్వీన్ గా మారిన సోయగం నయనతార. లవ్ బ్రేకప్స్ లో బాలీవుడ్ కే పాఠాలు నేర్పుతోన్నా.. ప్రస్తుతం స్టోరీ సెలెక్షన్స్ లో హీరోలనే ఇన్స్ స్పైర్ చేస్తోందీ భామ. 2003లో కెరీర్ స్టార్ట్ చేసిన నయన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నా ఆగకుండా దూసుకుపోతూనే ఉంది. నయనతార.. కొన్నాళ్ల క్రితం ఓ సాధారణ హీరోయిన్. రోజులు మారుతున్నా కొద్దీ అసాధారణమైన కెరీర్ ను బిల్డ్ చేసుకుని.. ఎంతోమంది అప్ కమింగ్ బ్యూటీస్ ను పర్ఫెక్ట్ ఇన్సిస్పిరేషన్ గా నిలుస్తోన్న తార. నయన్ ఎంట్రీ ఇచ్చిన సినిమాలను బట్టి.. అసలు తను పట్టమని పది సినిమాలైనా చేస్తుందా అనుకున్నారంతా. కానీ తను ఎదిగిన విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇన్సియల్ డేస్ లోనే ఏకంగా రజినీకాంత్ వంటి సూపర్ స్టార్స్ తో యాక్ట్ చేసే చాన్సెస్ కొట్టేసి.. ఒక్కో సినిమాతో కెరీర్ ను టాప్ రేంజ్ కు తీసుకువెళ్లింది. 

రెండు బ్రేకప్స్ తర్వాత కూడా ఏ బ్రేక్ లేకుండా కెరీర్ ను టాప్ గేర్ లో తీసుకువెళుతోన్న నయనతార కెరీర్ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించేది. టాప్ హీరోలు తను డేట్స్ ఇస్తే బావుండు అనుకునే రేంజ్ తనదిప్పుడు. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో నయన్ కెరీర్ చాలానే చెబుతుంది. ప్రతి హీరోయిన్ కూడా ఆమె కెరీర్ ఓ పాఠం. ప్రేమలో పడ్డంత మాత్రాన కెరీర్ ఆగిపోయినట్టు కాదు. ఇన్నేళ్ల కెరీర్ లో నయన్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. అందుకే తనిప్పుడు ఓ స్ట్రాంగ్ లేడీగా మారింది. ఆడవాళ్లంటే కొద్దిశాతం తక్కువ భావం ఉన్న ఇండస్ట్రీనే తన విజయాలతో తన చుట్టూ తిరిగేలా చేసుకున్న నయన్ జర్నీ నిజంగా ఓ గొప్ప పాఠమే. 

ప్రస్తుతం తెలుగులో తను చేస్తోన్న ఒకే ఒక్క సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి సరసన నటిస్తోంది. చిరంజీవితో తను యాక్ట్ చేయడం ఫస్ట్ టైమ్. ఈ మూవీలో తను నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ  పాత్రలో కనిపిస్తుంది. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా తన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీమ్. సంప్రదాయంగా పెళ్లికూతురులా ముస్తాబైన ఈ లుక్ సింప్లీ సూపర్బ్. మొత్తంగా విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటోన్న ఈ ధీరవనితకు సినిమా పాలిటిక్స్ నుంచి హ్యాపీ బర్త్ డే. 

More Related Stories