English   

నెక్ట్స్ వీక్ సినిమాల జాతర

24-kisses
2018-11-19 12:20:48

ఇయర్ ఎండింగ్ కు వచ్చేశామంటే క్లియరెన్స్  సేల్ లా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. మాగ్జిమం వీటిని క్లియరింగ్ సేల్ అంటుంటారు. వీటిలో ఏ కొన్ని సినిమాలో తప్ప ఏవీ ఆకట్టుకోవు. కానీ వరుసగా అప్పటి వరకూ మనం చూడని పోస్టర్స్ కూడా రిలీజ్ డేట్ తో రెడీగా ఉంటాయి. అలా వచ్చే వారం కూడా టాలీవుడ్ లో పాంచ్ పటాకా జరగబోతోంది. అఫ్ కోర్స్ ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయినా వారం ఉండగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకున్నారంటే ఖచ్చితంగా వీళ్లు తమ సినిమాలపై గట్టినమ్మకం పెట్టుకుని ఉంటారు. వారి నమ్మకం ఏ మేరకు నిజమవుతుందో కానీ ఈ నెల 22, 23న ఐదు సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. 

వీటిలో కాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోన్న సినిమా.. హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24కిస్సెస్’. కాస్త అడల్ట్రరీగానే కనిపిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. ఆ విషయంలో హెబ్బాకు కూడా కాస్త క్రేజ్ ఉంది కాబట్టి.. ఈ 24 ముద్దులకు మంచి గిరాకీ తగిలే అవకాశం ఉంది. మిణుగురులు వంటి సినిమా తీసిన అయోధ్యకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. 24 కిస్సెస్ ట్రైలర్ చూస్తే ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 24 కిస్సెస్ ఈ నెల 23న విడుదల కాబోతోంది.

ఇక తర్వాత ‘శరభ’ అనే గ్రాఫికల్ సినిమా లైన్లో ఉంది. నరసింహారావు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఫర్వాలేదు అనేలా ఉంది. పైగా గ్రాఫిక్స్ మరీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అంతా కొత్తవారితో రూపొందించిన ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టడం విశేషం. మొన్నటి బ్యూటీఫుల్ హీరోయిన్ జయప్రద ఓ కీలక పాత్రలో నటించింది. శరభ 22న వస్తోంది. 

ఇక మిగతా వాటిలో వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వస్తోన్న సినిమా ‘రంగు’ ఉంది. ఇదో రియల్ స్టోరీ. విజయవాడలో జరిగిన కథ.. లారా అనే ఓ సాధారణ యువకుడు అనుకోని పరిస్థితుల్లో రౌడీషీటర్ గా మారి.. ఆనక హత్య చేయబడతాడు. ఓ మంచి ఎమోషనల్ కమర్షియల్ సినిమాకు ఏమాత్రం తీసిపోని కథ రంగు సినిమాది. కానీ కొత్త దర్శకుడు.. అంతా మర్చిపోయిన తనీష్ హీరోగా వస్తోంది. కాబట్టి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. రంగు 23న పడబోతోంది. 

ఇక ఇన్నాళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోన్న కమల్ కామరాజ్, మౌర్యానీ జంటగా రూపొందిన సినిమా ‘లా’ లవ్ అండ్ వార్. ఈ మూవీ 23న విడుదలవుతోంది. అలాగే రూల్ అనే మరో కొత్త సినిమా కూడా అదే రోజు వస్తోంది. మొత్తంగా ఈ ఐదు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటంటే.. రిలీజ్ డేట్ తోనే కాదు.. చిన్న సినిమాలు కదా చిన్న చూపు చూడక్కర్లేదు అనేలా.. ఏకంగా రిలీజ్ అయ్యే థియేటర్స్ లిస్ట్ తో సహా అనౌన్స్ చేసుకుని రెడీగా ఉన్నారు. మరి ఈ క్లియరెన్స్ సేల్ లో క్లియర్ గా ఆకట్టుకునేది ఎవరో చూడాలి. 

More Related Stories