English   

ఆ హీరోయిన్ తో హోట‌ల్లో ర‌ణ్ బీర్ క‌పూర్.. 

Ranbir-Alia
2018-11-19 13:02:31

బాలీవుడ్ లో ఇప్పుడు ప్రేమ‌లు పెళ్ళిళ్లు బాగానే జ‌రుగుతున్నాయి. ఒక‌ప్పుడు ప్రేమించుకున్నా కూడా పెళ్లి వ‌ర‌కు వెళ్తారా లేరా అనే అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అది లేదు. క‌చ్చితంగా ప్రేమించిన వాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు. దీపిక ప‌దుకొనే, ర‌న్వీర్ సింగ్ కూడా ఇది మ‌రోసారి నిరూపించారు. అయినా బాలీవుడ్ లో ఎప్పుడు ఎవ‌రితో  జోడీ క‌డుతున్నారో చెప్ప‌డం చాలా క‌ష్ట‌మైపోయింద‌బ్బా. విడిపోయారని క‌న్ఫ‌ర్మ్ చేసుకున్న పాత జంట‌లు మ‌ళ్లీ క‌లిసిపోతున్నారు. ఇప్పుడు క‌త్రినాకైఫ్-స‌ల్మాన్ ఖాన్ ఇదే చేసారు. అయితే స‌ల్మాన్ ఖాన్ ఆరెంజ్ లో రామ్ చ‌ర‌ణ్ టైప్. ప్రేమ ఎక్కువ కాలం ఉండ‌దంటాడు. అందుకే ఉన్న‌న్ని రోజులు హాయిగా హ్యాపీగా ఉండాల‌నుకునే ర‌కం కండ‌ల‌వీరుడిది. 

అదేం విచిత్ర‌మో కానీ క‌త్రినాకు త‌గిలే బాయ్ ఫ్రెండ్స్ ఆరెంజ్ లో రామ్ చ‌ర‌ణ్ లాంటోళ్లే త‌గ‌లుతుంటారు. స‌ల్మాన్ త‌ర్వాత ర‌ణ్ బీర్ తో కూడా ఇలాగే క్లోజ్ అయింది క‌త్రినా. ఆయ‌న‌తో వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. ఇళ్లు కూడా తీసుకున్నారు కానీ ఆ త‌ర్వాత విడిపోయారు. ఇక ఇప్పుడు ర‌ణ్ బీర్ క‌పూర్ కూడా అలియా భ‌ట్ ప్రేమ‌లో ఉన్నాడు. ఈ ఇద్ద‌రూ బ్ర‌హ్మ‌స్త్ర సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారిప్పుడు. అలాగే క‌లిసి బ‌త‌కాల‌నుకుంటున్నారు కూడా. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ముంబైలోని ఓ హోట‌ల్లో ఈ ఇద్ద‌రూ క‌లిసి క‌నిపించార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి త్వ‌ర‌లోనే భ‌ట్ గారింటికి క‌పూర్ అల్లుడు వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. 2020లో వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 

More Related Stories