English   

బాలయ్య సినిమాలో శ్రియ ఐటెమ్ సాంగ్

Shriya-Saran
2018-11-19 20:16:09

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవెయిటెడ్ సినిమా ‘‘ఎన్టీఆర్’’. నందమూరి తారకరామారావు బయోపిక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలనాటి తారలను రీ క్రియేట్ చేస్తూ ప్రతి పాత్రతోనూ సర్ ప్రైజ్ చేస్తున్నారు బాలయ్య అండ్ డైరెక్టర్ క్రిష్. ఇప్పటికే ఎన్నో పాత్రలను మరోసారి చూపించబోతోన్న ఈ ద్వయం.. ఈ సారి శ్రీయను కూడా రంగంలోకి దించారు. వీరి కాంబోలో గతంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణిలో ప్రధాన పాత్ర చేసిన శ్రీయకు మరో అవకాశం ఇచ్చారు. అయితే ఈ సారి ప్రధాన పాత్ర కాదు. అనొచ్చో లేదోకానీ.. ఇది ‘ఐటమ్ సాంగ్’ లాంటిది. ఎందుకంటే ఆ సినిమాలో కూడా ఈ పాట అలాగే కనిపిస్తుంది. ఇంతకీ ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రియ చేస్తోన్న పాత్ర ఏంటో తెలుసా.. అలనాటి నటి ప్రభ పాత్రలో కనిపించబోతోంది. 

దానవీరశూరకర్ణ సినిమా గురించి మాట్లాడుకుంటే ఎవరికైనా గుర్తొచ్చే పాటల్లో చిత్రం భళారే చిత్రం అనే పాట. ఆ పాటలో ఎన్టీవోడి నటనా వైదుష్యం చూసి తీరాల్సిందే. ఇక సినిమాలో ఆయన్ని అంతటి ఆశ్చర్యానికి గురిచేసే పాత్రలో అప్పట్లో ప్రభ నటించారు. ఆమె ఓ స్టార్ హీరోతో నటించిన ఫస్ట్ మూవీ అదే కావడం విశేషం. ఆ తర్వాత తనేమీ స్టార్ హీరోయిన్ కాలేదు కానీ.. మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆమె పాత్ర అనలేం కానీ.. ఆ సినిమా గురించి ప్రస్తావనలో భాగంగా ఈ పాట ఉంటే బావుంటుంది అనుకున్నారట. అందుకే వెంటనే శ్రీయను సీన్ లోకి దించారు. సో.. ఇప్పుడు దానవీర శూరకర్ణలోని చిత్రం భళారే విచిత్రం అంటూ సాగే నాటి ఐటెమ్ సాంగ్ లాంటి పాటలో నేడు శ్రియ నర్తించబోతోందన్నమాట. 

More Related Stories