English   

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ప‌డిపోయిన బ‌న్నీ

Allu Arjun as Chief Guest For Vijay Devarakonda’s Taxiwala Team Celebration Party
2018-11-20 08:50:31

విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం ఇప్పుడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు నిజంగానే ప‌డిపోయాడు అల్లు అర్జున్. ఓ హీరో మ‌రో హీరోకు ప‌డిపోవ‌డం చాలా రేర్ గా జ‌రుగుతుంటుంది. ఒక‌వేళ ప‌డిపోయినా కూడా చెప్ప‌రు. అంటే వాళ్ల‌కు మ‌న‌స్పూర్థిగా అవ‌త‌లి వాళ్ల న‌ట‌న న‌చ్చినా కూడా పైకి చెప్ప‌డానికి మ‌న‌సు రాదు.. ఇగో అనే గోడ అడ్డొస్తుంది. కానీ బ‌న్నీ మాత్రం ఇప్పుడు అలాంటి ఇగోలేవీ లేకుండా ఉన్నాడు. ఈ హీరోకు ఎందుకో తెలియ‌దు కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే భ‌లే ఇష్టం. అత‌డి ప్ర‌తీ సినిమాను కూడా ద‌గ్గ‌రుండి ప్రోత్స‌హిస్తున్నాడు. పెళ్లిచూపులు నుంచి నేటి టాక్సీవాలా వ‌ర‌కు అన్నింటికి వెన‌క పిల్ల‌ర్ లా ఉన్నాడు. ఇప్పుడు విడుద‌లైన టాక్సీవాలా కూడా రెండ్రోజుల్లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. దాంతో గ్రాండ్ పార్టీ చేసుకున్నారు చిత్ర‌యూనిట్. ఇందులో బ‌న్నీ చీఫ్ గెస్ట్ గా వ‌చ్చి ర‌చ్చ చేసాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు టీం అంద‌రితోనూ ఎంజాయ్ చేసాడు.

Allu Arjun as Chief Guest For Vijay Devarakonda’s Taxiwala Team Celebration Party

త‌న సొంత సంస్థ గీతాఆర్ట్స్ లో వ‌ర‌స‌గా రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇవ్వ‌డంతో విజ‌య్ అంటే బ‌న్నీకి కూడా మ‌రింత ప్రేమ వ‌చ్చేసింది. అందుకే స‌పోర్ట్ చేస్తూనే ఉన్నాడు. అర్జున్ రెడ్డి అప్పుడు ఓపెన్ గా విజ‌య్ న‌ట‌న గురించి చెప్పాడు. గీత‌గోవిందం అప్పుడు త‌న‌లా నేను న‌టించ‌లేను అని చెప్పాడు. మొన్న టాక్సీవాలా స‌మ‌యంలో కూడా అస‌లు విజ‌య్ లాంటి క‌థ‌లు తాను జీవితంలో చేయ‌లేన‌ని ఒప్పుకున్నాడు. ఏదేమైనా తాను స్టార్ అయ్యుండి కూడా మ‌రో చిన్న హీరోను పొగ‌డ‌టం మాత్రం చిన్న విష‌యం కాదు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో బ‌న్నీ ప్రేమ చూసి అంతా ఇదే అనుకుంటున్నారు కూడా.

More Related Stories