English   

ఫ్లాష్ న్యూస్.. పీకే ఈజ్ బ్యాక్

Flash News Pawan Kalyan Ready to do a Movie Before AP Elections
2018-11-20 10:52:08

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాడా..? ఈయ‌న ఇంకో సినిమా చేయ‌బోతున్నాడా..? ఎన్నిక‌ల‌కు ముందే మ‌రో సినిమా చేస్తాడా.. అయిన త‌ర్వాత అన్నీ ప్ర‌శాంతంగా ఉన్న టైమ్ లో చేస్తాడా..? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లెందుకు వ‌స్తున్నాయ్ అనుకుంటున్నారా.. ? ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇది డిస్క‌స్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప‌వ‌న్ మ‌న‌సులో కూడా సినిమాలు చేయాల‌నే నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన తెర‌వెనక ఏర్పాట్లన్నీ వేగంగా జ‌రుగుతున్నాయి. అన్నీ కుదిర్తే ఎల‌క్ష‌న్ కంటే ముందే ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఇప్పుడే దీనిపై చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.

అంతేకాదు.. క‌థ కూడా ఫైన‌ల్ అయిపోయింది. నిర్మాత కూడా ఓకే అనేసాడు. నేల‌టికెట్టు ఫేమ్ రామ్ త‌ళ్లూరితో ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ 45 నిమిషాలు క‌నిపించే పాత్ర చేస్తాడ‌ని.. పూర్తిగా పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చే ఈ క‌థ‌పై ప‌వ‌న్ కూడా చాలా ఆస‌క్తిగా ఉన్నాడ‌ని తెలుస్తుంది. 40 రోజుల కాల్షీట్స్ కూడా ఇచ్చేసాడ‌ని.. అన్నీ కుదిర్తే డిసెంబ‌ర్ లోనే మొద‌లుపెట్టి.. ఎన్నిక‌ల ముందు విడుద‌ల చేయ‌డం ఖాయం అని తెలుస్తుంది. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్ పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. అయితే ఈ మ‌ధ్య మ‌ళ్లీ పాత లుక్ లోకి వ‌చ్చి స్మార్ట్ గా మారిపోయాడు. దానికి కార‌ణం కూడా సినిమాలే అని తెలుస్తుంది. 2020లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి కానీ ఖచ్చితంగా ఇప్పుడే ఎన్నిక‌ల ముందే ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌నేది ఆలోచిస్తున్నాడు ప‌వ‌ర్ స్టార్.

అలా చేయ‌డం వ‌ల్ల కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఊపొస్తుంది. హిట్టైతే పార్టీకి బ‌ల‌మొస్తుంది. ఆ ప్ర‌భావం కూడా ఎన్నిక‌ల ఫ‌లితంపై క‌నిపించే అవ‌కాశం ఉంది. ఆ మ‌ధ్య స‌ర్కార్ సినిమా రీమేక్ చేస్తాడ‌నే వార్త‌లు వ‌చ్చినా కూడా తెలుగులో అది రిలీజ్ కావ‌డంతో ఏం చేయ‌లేక‌పోయాడు ప‌వ‌న్. ఇప్పుడు ప‌వ‌న్ మ‌న‌సు సినిమాల వైపు మ‌ళ్ల‌డంపై అత‌డి వైపు వ‌ర్గాల నుంచి కూడా సానుకూలంగానే స్పంద‌న వ‌స్తుంది. అంటే ఖచ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ళ్లీ సినిమాల్లో ఊహించొచ్చు. పైగా ప‌వ‌న్ కూడా సినిమాల‌కు రిటైర్మెంట్ అయితే ఇవ్వ‌లేదు. బ్రేక్ ఇస్తున్నాన‌ని చెప్పాడంతే. అప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ప‌వ‌న్ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి చూడాలిక‌.. దీనికి ద‌ర్శ‌కుడు ఎవ‌రో..? అన్న‌ట్లు ఈ చిత్రంలో మ‌రో కుర్ర హీరో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్ర పూర్తి వివ‌రాలు బ‌య‌టికి రానున్నాయి.

More Related Stories