English   

విశాల్ అయోగ్యుడు అబ్బా.. ఇదిగో సాక్ష్యం.. 

Vishal-Ayogya
2018-11-20 13:02:49

అయోగ్యుడు అంటే యోగ్య‌త లేని వాడు అని అర్థం. మ‌రి విశాల్ లాంటి మంచి హీరోను.. మంచి మ‌నిషిని ప‌ట్టుకుని అంత మాటెందుకు అంటున్నారు అనే అనుమానం రావ‌చ్చు. కానీ ఇప్పుడు తానే ఈ మాట చెప్పుకుంటున్నాడు. నిజంగానే తాను అయోగ్య అంటున్నాడు. ఈయ‌న ప్ర‌స్తుతం టెంప‌ర్ రీమేక్ లో న‌టిస్తున్నాడు. తెలుగుతో పాటు త‌మిళ‌నాట కూడా మంచి వ‌సూళ్లే తీసుకొస్తున్నాయిన ఈయ‌న సినిమాలు. ఇప్పుడు మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు విశాల్. అదే టెంప‌ర్ రీమేక్. విశాల్ కు మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉంది. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాల్లేవు. కానీ నటుడిగా విశాల్ కు ప‌రీక్ష పెట్టిన సినిమాలు చాలా త‌క్కువ‌గానే వ‌చ్చాయి. వాడువీడు సినిమా మిన‌హా విశాల్ చేసిన సినిమాల‌న్నీ మాస్ మ‌సాలా సినిమాలే. టెంప‌ర్ లో మాస్ తో పాటు న‌ట‌న‌కు కూడా ఆస్కారం ఉంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా ఎన్టీఆర్ ఇక్క‌డ ఇర‌గ‌దీసాడు. ఇంతే న‌ట‌న విశాల్ లో ఉందా అనేది అంద‌రికీ క‌లిగే అనుమానం. ముఖ్యంగా ఎమోష‌నల్ సీన్స్ లో ఎన్టీఆర్ దుమ్ము లేపాడు. 

విశాల్ లో ఇంతటి ఎమోష‌న్ ఉందా..?  ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. అయోగ్య పేరుతో వ‌స్తున్న ఈ చిత్రాన్ని వెంక‌ట్ తెర‌కెక్కిస్తున్నాడు. అయితే సినిమా ఎంత బాగా వ‌చ్చినా కూడా తాను  మాత్రం ఎన్టీఆర్ రేంజ్ లో చేయ‌లేద‌ని.. అంత సినిమా కూడా త‌న‌కు లేద‌నీ.. క‌నీసం సినిమాను తెలుగులో విడుద‌ల కూడా చేయ‌న‌ని చెప్పాడు విశాల్. ఒక‌వేళ తాను కానీ తెలుగులో సినిమా విడుద‌ల చేస్తే ఎన్టీఆర్ తో పోల్చి చూస్తారు అప్పుడు తానే త‌ల దించుకోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పాడు విశాల్. టెంప‌ర్ రీమేక్ లో ముందు శింబు న‌టిస్తాడ‌ని చెప్పారు.. కానీ ఇప్పుడు అది విశాల్ చేతుల్లోకి వెళ్లింది. అయితే తాను మాత్రం ఎన్టీఆర్ చేసిన రేంజ్ లో చేయ‌లేన‌ని.. ఆ సినిమా చూసాన‌ని.. అది చూసిన త‌ర్వాత అలా చేయ‌డం నా వ‌ల్ల మాత్రం కాదంటున్నాడు విశాల్. త్వ‌ర‌లోనే అయోగ్య విడుద‌ల కానుంది. చూడాలిక‌.. టెంప‌ర్ రీమేక్ లో విశాల్ జూనియ‌ర్ ను మ‌రిపిస్తాడో లేదో..?

More Related Stories