English   

‘సైరా’లో సౌండింగ్ గమనించారా..?

Sye-Raa
2018-11-20 15:16:21

‘సైరా’ నరసింహారెడ్డి.. మెగాస్టార్ కెరీర్ లో మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్. ఇలాంటి సినిమా ఆయన గతంలో చేసి ఉండకపోవడం.. అతను తొలి స్వాతంత్ర్య సమరయోధుడుగా చెప్పబడుతోన్న నాయకుడు కావడంతో పాటు ఆయన వయసు కూడా ఈ ప్రాజెక్ట్ ను ప్రిస్టీజియస్ గా మార్చాయి. ఆయన అంతే సవాల్ గా ఈ పాత్ర చేస్తున్నాడు. తన కెరీర్ లోనే ఓ మెమరబుల్ మూవీగా మలచుకునేందుకు ఈ చిత్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి మొదటి నుంచి సంగీత దర్శకుడి విషయంలో చాలా సమస్యలు వచ్చాయి. మొదట్లో ఏ ఆర్ రహ్మాన్ ను అనుకున్నారు. అప్పట్లో పోస్టర్ లో పేర్లు కూడా వేశారు. బట్ రహ్మాన్ నో చెప్పాడు. తర్వాత దేవీ శ్రీ ప్రసాద్ పేరు వినిపించింది. కానీ దేవీ కూడా అందుబాటులో ఉండలేను అన్నాడు. 

తర్వాత గౌతమీపుత్ర శాతకర్ణి సంగీత దర్శకుడు చిరంతన్ భట్ పేరు కూడా పరిశీలించారు. బట్  బాగా లేట్ అయిన తర్వాత ఫైనల్ గా అమిత్ త్రివేదీ అనే బాలీవుడ్ సంగీత దర్శకుడిని ఫైనల్ చేశారు. ఇతని వర్క్ గురించి మనాళ్లకు పెద్దగా తెలియదు. అయితే లేటెస్ట్ గా నయనతార బర్త్ డే మోషన్ పోస్టర్ లో అతని ఆర్ఆర్ కాస్త జాగ్రత్తగా గమనించండి.. సినిమాకు ఖచ్చితంగా ఓ అద్భుమైన సంగీతం అందించేలా ఉన్నాడు. నిజంగానే ఆ ఆర్ఆర్ అద్దిరిపోయింది. ఇలాంటి సినిమాకు అలాంటి ఆర్ఆర్ ఉంటే ఇంక గూస్ బంప్స్ అన్నట్టే. ఏదేమైనా లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు మంచి సంగీత దర్శకుడినే తీసుకున్నట్టు తెలుస్తోంది.  

More Related Stories