English   

శంక‌ర్  సినిమాలో వెన్నెల కిషోర్

Vennela-Kishore
2018-11-20 16:05:49

టాలీవుడ్ లో ఉన్న టాప్ క‌మెడియ‌న్స్ లో వెన్నెల కిషోర్ కూడా ఒక‌రు. ఇప్పుడు ఈయ‌న ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఏ సినిమా విడుద‌లైనా కూడా అందులో వెన్నెల కుర‌వాల్సిందే. ప్ర‌తీ సినిమాలోనూ త‌న‌దైన శైలిలో న‌వ్వులు పూయిస్తున్న వెన్నెల కిషోర్ ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్తున్నాడ‌ని తెలుస్తుంది. అది కూడా శంక‌ర్ లాంటి అగ్ర ద‌ర్శ‌కుడు ఈయ‌న‌కు ఛాన్స్ ఇస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. శంకర్ ప్ర‌స్తుతం భారతీయుడు 2కు సిద్ధ‌మ‌వుతున్నాడు. 20 ఏళ్ల కింద వ‌చ్చిన భార‌తీయుడు అన్నిచోట్లా విజ‌యం సాధించింది. ఇప్పుడు కమల్ హాస‌న్ హీరోగా సీక్వెల్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజ‌ల్ హీరోయిన్. 

అంతేకాదు.. ఈ చిత్రం కోసం ఇప్పుడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ను తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో కూడా తెలుగు క‌మెడియ‌న్స్ లో త‌న‌కు వెన్నెల కిషోర్ న‌చ్చుతాడ‌ని.. ఆ మ‌ధ్య మారుతి భలేభలే మగాడివోయ్ సినిమాలో అత‌డి కామెడీ చూసిన‌పుడు న‌వ్వు వ‌చ్చింద‌ని చెప్పాడు శంక‌ర్. ఇప్పుడు ఇదే న‌మ్మ‌కంతోనే భార‌తీయుడు 2లో ఆఫ‌ర్ ఇస్తున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం కోసం ఏకంగా 70 రోజులు డేట్స్ కూడా అడిగినట్టు సమాచారం. మ‌రి దీనికి వెన్నెల కిషోర్ ఒప్పుకుంటాడా అనేది తెలియాలి. ఎందుకంటే అంత బిజీగా ఉండే క‌మెడియ‌న్ ఒకే సినిమా కోసం 70 రోజులు ఇవ్వ‌డం గ‌గ‌న‌మే. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రగ‌బోతుందో..? 

More Related Stories