English   

శ్రీ‌నువైట్ల‌ను ఇంక మ‌రిచిపోవ‌చ్చు క‌దా..

Srinu-Vaitla
2018-11-20 17:03:15

ఇప్పుడు ఇదే అంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. ఒక్క సినిమా అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ వ‌ర‌స‌గా నాలుగు డిజాస్ట‌ర్లు ఇచ్చిన త‌ర్వాత ఎంత‌టి ఘ‌న చ‌రిత్ర ఉన్నా కూడా ఆయ‌న్ని మ‌రిచిపోవ‌డం ఖాయం. ఇప్పుడు శీనువైట్ల విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. అన్నీ బాగున్నపుడు ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది. కానీ బ్యాడ్ టైమ్ లోనే అన్నీ క‌లిసొచ్చి మ‌రీ తిప్ప‌లు పెడుతుంటాయి. ఇప్పుడు శీనువైట్ల‌కు ఇదే జ‌రుగుతుంది కూడా. పాపం ఈ ద‌ర్శ‌కుడు ఎక్క‌డి నుంచి ఎక్క‌డికి వ‌చ్చాడో.. మూడేళ్ల కింద ఈయ‌న‌తో సినిమా అంటే ఎగిరి గంతేసిన హీరోలంతా ఇప్పుడు శీను క‌నిపిస్తే ఎలా త‌ప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. దానికి కార‌ణం మూడు భారీ డిజాస్ట‌ర్లు. ఆగ‌డు.. బ్రూస్ లీ.. మిస్ట‌ర్ మూడు భారీ న‌ష్టాల‌నే తీసుకొచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా శీనువైట్ల అంటే ఆలోచిస్తున్నారు. 

ఇన్నాళ్లూ ఏదో చేస్తాడులే.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో బౌన్స్ బ్యాక్ అవుతాడులే అనుకున్నారంతా. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత వైట్ల గారి బుర్ర‌పైనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అస‌లు ఇప్పుడు మ‌రో హీరో శీనువైట్ల‌ను న‌మ్మే ధైర్యం కూడా చేయ‌డు. ర‌వితేజ‌, మైత్రి మూవీ మేక‌ర్స్ లాంటి వాళ్లు న‌మ్మిన త‌ర్వాత కూడా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని డిజాస్ట‌ర్ చేసాడు శీనువైట్ల‌. దాంతో ఇప్పుడు ఈయ‌న సినిమాలు చేయ‌కూడ‌ద‌ని ఫిక్స్ అయిపోయాడు. హాయిగా వెబ్ సిరీస్ లు చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు శీనువైట్ల‌. ఇప్పుడు వెబ్ సిరీస్ కి ఉన్న క్రేజ్ కూడా త‌క్కువేం కాదు. పైగా వైట్ల‌కి కామెడీపై మంచి ప‌ట్టుంది. అందుకే ర‌వితేజ సినిమా వ‌ర్క‌వుట్ అయ్యేలోపు ఓ వెబ్ సిరీస్ చేయాల‌నే ప్లాన్ చేస్తున్నాడు శీనువైట్ల‌. 
 

More Related Stories