English   

లేదు లేదంటూనే నాని.. ఓకే అన్నాడా..?

Nani-Nikhil
2018-11-20 18:53:25

లాస్ట్ ఇయర్ వరకూ ఫుల్ స్వింగ్ లో ఉన్న నానికి ఈ ఇయర్ గట్టి షాకే ఇచ్చింది. వచ్చిన సినిమాలన్నీ పోయాయి. పోతే పోయాయి కానీ అంతకు ముందు చేసినవి కూడా ఏమంత బాలేదు. అయినా నీ కోసం హిట్ అయ్యాయి. ఇప్పటికీ(రొటీన్ స్టోరీస్ నుంచి) మారపోతే ఇది ఇంకెంతో కాలం సాగదు.. అనే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆడియన్స్. దీంతో రీ థాట్ లో పడ్డాడీ నేచురల్ స్టార్. కాస్త రూట్ మార్చి మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడు. నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘దేవదాస్’ చేశాడు. దాస్ గా అతని పాత్ర, నటన బావున్నా సినిమాలో పెద్దగా పస లేకపోవడంతో ఈ మల్టీస్టారర్ కాస్తా బోరింగ్ గా మారింది. అయినా నాని వద్దకు కొన్ని మల్టీస్టారర్ కథలు వచ్చాయి. కానీ దేవదాస్ ఎఫెక్ట్ తోఇకపై మల్టీస్టారర్స్ చేయను అని భీష్మించి మరీ చెప్పాడట. కానీ తన మెంటార్ ఇంద్రగంటి మోహనకృష్ణ అడగడంతో కాదు, లేదూ, కుదరదు అనుకుంటూనే ఊఁ కొట్టాడు అంటున్నారు.
 
నానిని హీరోగా నిలబెట్టింది ఇంద్రగంటి మోహనకృష్ణ. సెన్సిబుల్ మూవీస్ తో సినిమాలు చేసే ఇంద్రగంటి చేసిన జెంటిల్మన్ నానికి మెమరబుల్ హిట్ గా నిలిచింది. మొత్తంగా అలాంటి వ్యక్తి అడిగాడు. పైగా మోహనకృష్ణ మంచి  కథలతోనే వస్తాడు. అందుకే అతని మల్టీస్టారర్ కథకు ఓకే చెప్పినట్టు టాక్. మరి నానితో కలిసి నటిస్తోంది ఎవరో తెలుసా.. నిఖిల్. యస్.. ఇతను కూడా వరుసగా రెండు మూడు సినిమాలతో హడావిడీ చేశాడు. కానీ సడెన్ గా మళ్లీ బ్యాక్ టు ఫ్లాప్స్ అంటున్నాడు. ప్రస్తుతం ముద్ర అనే సినిమాతో డిసెంబర్ 28న వస్తున్నాడు. దీని తర్వాత శ్వాస అనే సినిమా ఒప్పుకున్నాడు. అయితే ఆ సినిమాతో పాటు ఈ మల్టీస్టారర్ కూడ చేయడానికి రెడీ అన్నట్టు టాక్. నాని, నిఖిల్ ఇద్దరూ కాస్త మంచి నటులే. అందుకే ఇంద్రగంటి ఈ ఇద్దరినీ అప్రోచ్ అయినట్టు టాక్. అంతకు ముందు నాగచైతన్యను కూడా సంప్రదించాడు. బట్ ' చే ' నో చెప్పాడట. మొత్తంగా నాని తన భీష్మ ప్రతిజ్ఞను అతి తక్కువ టైమ్ లోనే బ్రేక్ చేసుకుంటున్నాడన్నమాట. 

More Related Stories