English   

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కావాల‌నే త‌ప్పుకున్నాడా..?   

Pawan-kalyan
2018-11-21 08:20:29

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేస్తున్నాడు.. త్వ‌ర‌లోనే ఈ చిత్రం మొద‌ల‌వుతుంది అని వార్త‌లు వ‌చ్చిన 24 గంట‌ల్లోనే తాను ఎలాంటి సినిమా చేయ‌డం లేదని క్లారిటీ ఇచ్చాడు ప‌వ‌ర్ స్టార్. ముందు నుంచి అనుకుంటున్న‌ట్లే ఇప్పుడు త‌న‌కు సినిమా చేయాల‌ని ఉన్నా కూడా ఇప్పుడు కానీ మోజులో ప‌డితే క‌చ్చితంగా జ‌న‌సేన పార్టీకి చాలా పెద్ద దెబ్బ ప‌డ‌టం ఖాయం అని ప‌వ‌న్ ముందుగానే ఊహించుకున్న‌ట్లు తెలుస్తుంది. ఎన్నిక‌ల‌కు ఆర్నెళ్లు మాత్ర‌మే ఉన్న ఈ స‌మ‌యంలో సినిమా అంటూ కూర్చుంటే అస్స‌లు ప‌ని జ‌ర‌గ‌దు. అప్పుడు అస‌లుకే మోసం వ‌స్తుంది. అందుకే ఎవ‌రెన్ని చెప్పినా కూడా ప‌వ‌న్ మ‌న‌సు మాత్రం రాజ‌కీయాల‌పైనే ఉంది. ఇక‌పై త‌న జీవితం ప్ర‌జాసేవ‌కు అంకితం అంటూ ప్రెస్ నోట్ కూడా విడుద‌ల చేసాడు ప‌వ‌ర్ స్టార్. అయితే ఈ ప్ర‌జాసేవ ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటుందా.. ఆ త‌ర్వాత కూడా కొన‌సాగుతుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

అంటే ఎన్నిక‌ల త‌ర్వాత అయినా సినిమాలు చేస్తాడా అనేది ఇప్పుడు అనుమానం. ఒకవేళ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన మంచి ఫలితాలు సాధిస్తే ఓకే.. లేదంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌రిస్థితి ఏంటి..? అప్పుడు చిరంజీవి కానీ ప్ర‌జారాజ్యం పెట్టి ఓడిపోగానే వెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్న‌ట్లే అప్పుడు ప‌వ‌న్ కూడా చేస్తాడా..? అస‌లు అన్న‌య్య‌ను చూసి ప‌వ‌ర్ స్టార్ ఇప్ప‌టికే చాలా రాజ‌కీయాలు నేర్చుకున్నాడు. ఎలా ఉండ‌కూడ‌దో అనేది ప‌వ‌న్ ముందుగానే చెప్పాడు. ప్రాణం పోయినా జ‌న‌సేన మ‌రో పార్టీలో విలీనం కాద‌ని చెప్పాడు. మొత్తానికి ఒక్క‌డిగానే ఇప్పుడు రాజ‌కీయాల్లో ప‌వ‌న్ పోరాడుతున్నాడు. మ‌రి ఆ త‌ర్వాత ఈ ఒక్క‌డే సైన్యంగా మార‌తాడేమో చూడాలిక‌. ఏదేమైనా ప‌వ‌న్ మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే సినిమాల నుంచి త‌ప్పుకుంటున్నాడు. అది ఫ్యాన్స్ కు కాస్త బాధ క‌లిగించినా కూడా త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు మాత్రం అది బాగానే ప‌నికొస్తుంది. 

More Related Stories