English   

టాక్సీవాలా స‌క్సెస్.. అబ్బే విజ‌య్ రేంజ్ కాద‌మ్మా.. 

Vijay-devarakonda
2018-11-21 09:18:42

ఏ పుట్ట‌లో ఏ పాము ఉందో ఎవ‌రికి ఎరుక అని పెద్ద‌లు ఊరికే అన‌లేదు. ఎవ‌రికి తెలుసు.. ఒక్కోసారి ఏం లేదు అనుకున్న సినిమాలే సంచ‌ల‌నాలు సృస్టిస్తుంటాయి.. కొన్నిసార్లు అద్భుతంగా ఉంటాయ‌నుకున్న‌వే అట్ట‌ర్ ఫ్లాప్ అవుతుంటాయి. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీవాలా విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యం దిశ‌గా అడుగులేస్తుంది. ఇప్ప‌టికే 12 కోట్లు షేర్ తీసుకొచ్చి.. బ‌య్య‌ర్లంద‌రినీ సేఫ్ జోన్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు టాక్సీవాలా విజ‌యం చూసి ఇది నిజంగా విజ‌య్ రేంజ్ హిట్ అనుకుంటే అంత‌కంటే పొర‌పాటు మ‌రోటి లేదు. ఎందుకంటే ఈ చిత్రం అర్జున్ రెడ్డి కంటే ముందు షూట్ చేసింది. అంటే మార్కెట్ కూడా అప్పుడే జ‌రిగింది. అందుకే ఇప్పుడు రెండు రోజుల‌కే సినిమా సేఫ్ జోన్ కు తీసుకెళ్లాడు విజ‌య్.
 
ఇప్పుడు మ‌నోడి రేంజ్ త‌క్కువ‌లో త‌క్కువ పాతిక కోట్లు. గీత‌గోవిందం 70 కోట్లు వ‌సూలు చేసినా కూడా క‌న్సిస్టెంట్ గా 25 కోట్లు తీసుకొస్తున్నాడు విజ‌య్. కానీ ఇప్పుడు టాక్సీవాలాను మాత్రం 7.5 కోట్ల‌కు మాత్ర‌మే అమ్మారు. అర్జున్ రెడ్డి ముందు జ‌రిగిన సినిమా కావ‌డంతో రేట్లు కూడా అంతే ఉన్నాయి. అదే ఇప్పుడు కానీ అమ్మి ఉంటే ఈజీగా 25 కోట్లు బిజినెస్ చేసేవాళ్లు. అంటే ఈ లెక్క‌ల‌తో పోలిస్తే టాక్సీవాలా 25 కోట్లు వ‌స్తే సూప‌ర్ హిట్ అన్న‌మాట‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు రోజుల్లో 12 కోట్లు షేర్ వ‌చ్చింది.. వీక్ డేస్ లోనూ బానే వ‌సూలు చేస్తుంది ఈ చిత్రం. మ‌రోవైపు ఈ వారం కూడా 24 కిస్సెస్ త‌ప్ప మ‌రో సినిమా లేదు. అంటే మ‌రో వారం రోజుల పాటు అడ్డు లేకుండా టాక్సీ దున్నేసుకోవ‌చ్చు. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఈ జ‌ర్నీ ఎక్క‌డ ముగుస్తుందో..? 

More Related Stories