English   

వాళ్ల‌ను కాల్చి పారేయాలంటున్న ర‌జినీకాంత్.. 

Rajinikanth
2018-11-21 11:55:05

ర‌జినీకాంత్ కు అస్స‌లు కోప‌మే రాదు.. అస‌లు ఆయ‌న కోపంగా ఉన్న ప‌రిస్థితి ఒక్క‌టి కూడా చూసుండ‌రు అభిమానులు. అంత సైలెంట్ గా శాంత స్వ‌భావుడిగా క‌నిపిస్తుంటాడు సూప‌ర్ స్టార్. అలాంటి ర‌జినీకాంత్ కూడా ఒక్కోసారి కోపం తెచ్చుకుంటాడు. ఎందుకంటే ఆయ‌న కూడా మ‌నిషే క‌దా.. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితి ఒకటి వ‌చ్చింది. త‌న జీవితంలో బాగా కోపం వ‌చ్చిన సంద‌ర్భం గురించి పంచుకున్నాడు ర‌జినీ. త‌న‌కు చిన్న పిల్ల‌లు అడుక్కోవ‌డం చూస్తే చాలా కోపం వ‌స్తుంద‌ని.. వాళ్ల‌ను సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర అలా చూస్తుంటే ఏడ్చేస్తాన‌ని చెప్పాడు ర‌జినీ. వాళ్ల‌ను అలా చేసిన వాళ్ల‌పై చాలా కోపం వ‌స్తుంద‌ని.. ఒక్కోసారి పిల్లల్ని చంక‌లో వేసుకుని పెద్ద‌వాళ్లే అడుక్కుంటుంటార‌ని.. అలాంటి వాళ్ల‌ను చూసిన‌పుడు బాధ‌తో పాటు ఒళ్లు మండిపోతుంద‌ని చెప్పాడు ర‌జినీ. అస‌లు పిల్ల‌ల్ని అలా చేయ‌డం చాలా నేరం అని గుర్తు చేసాడు సూప‌ర్ స్టార్. వాళ్ల‌కు అలాంటి ప‌రిస్థితి తీసుకొచ్చిన వాళ్ల‌ను న‌డిరోడ్డుపై న‌రికేసినా.. కాల్చి పారేసినా త‌ప్పులేద‌ని.. అలాగే చేయాల‌ని కూడా చెప్పాడు ర‌జినీకాంత్. త‌నకి అలాంటి సీన్ చూసినా కూడా క‌ళ్ల‌లో నీళ్లు తిరుగుతాయ‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్. అంతేక‌దండి మ‌రి.. చిన్న చిన్నపిల్ల‌లు అలా రోడ్డుపై సిగ్న‌ల్స్ ద‌గ్గ‌ర బిక్ష‌మెత్తుకుంటుంటే ఏ మ‌న‌సు మాత్రం ఊరికే ఉంటుంది. వాళ్ల‌ను చూసి తెలియ‌కుండానే క‌ళ్ల నీళ్లు వ‌చ్చేస్తుంటాయి.

More Related Stories