English   

దుమ్ము దులిపేస్తున్న విజ‌య్ పాట‌.. 

Nee-Venakale
2018-11-21 12:35:39

విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ నేర్పిస్తున్నాడు. కేవ‌లం సినిమాల నుంచే కాదు.. ఇంకా చాలా విష‌యాల్లో ఈయ‌న స్టైల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతున్నాయి. విజ‌య్ ఏం చేసినా కూడా అది కొత్త ట్రెండ్ అయిపోతుంది. అప్పుడెప్పుడో గ‌బ్బ‌ర్ సింగ్ ప‌వ‌న్ చెప్పిన ట్రెండ్ డైలాగ్ ఇప్పుడు పాటిస్తున్నాడు. తెలుగులో ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బ‌మ్స్ చాలా త‌క్కువ‌గా వ‌స్తుంటాయి. ఎవ‌రో చేసినా కూడా చిన్న వాళ్లే చేస్తుంటారు. కానీ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇది కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఈయ‌న తెలుగు, త‌మిళ‌నాట చేసిన నీ వెన‌కాల నడిచి సాంగ్ విడుద‌లైంది. రెండు భాష‌ల్లోనూ ఇప్పుడు దుమ్ము దులిపేస్తుంది ఈ పాట‌. తెలుగులో అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. 

ప్లై స్కై స్టూడియోస్.. చౌద‌రి సాబ్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ పాట‌ను నిర్మించారు. అద్భుత‌మైన సినిమాటోగ్ర‌ఫీతో వ‌చ్చిన ఈ పాట‌ను చిన్మయి పాడింది. ఇప్పుడు యూ ట్యూబ్ ట్రెండింగ్ లో మూడోస్థానంలో ఉంది. ఇప్ప‌టికే ప‌ది ల‌క్ష‌ల వ్యూస్ కూడా వ‌చ్చేసాయి. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న మ‌లోబిక న‌టించింది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ముఖ్యంగా విజ‌య్ మోకాళ్ల మీద కూర్చుని ప్ర‌పోజ్ చేసే సీన్ అయితే అదిరిపోయింది. మొత్తానికి ఇప్పుడు ప్రైవేట్ ఆల్బ‌మ్స్ ట్రెండ్ కూడా తెలుగు ఇండ‌స్ట్రీకి తీసుకొస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌రోవైపు ఈయ‌న న‌టించిన టాక్సీవాలా క‌లెక్ష‌న్ల దుమ్ము దులిపేస్తుంది. ఈ చిత్రం డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ స్టేజ్ దాటేసి.. ట్రిపుల్ వైపు ప‌రుగులు తీస్తుంది. 

More Related Stories