English   

‘ఎన్టీఆర్’ పోస్ట్ పోన్ అవుతోందా..?

NTR-biopic
2018-11-21 18:56:50

టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజయస్ ప్రాజెక్ట్ నందమూరి తారకరామారావు బయోపిక్ ‘‘ఎన్టీఆర్’’. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో భారీతారగణమే కనిపించబోతోంది. ఎన్టీఆర్ బయోపిక్ అంటే ఆనాటి కాలాన్ని మళ్లీ చూపించాలి. నాటి నటీనట వర్గాన్నీ చూపించాలి. అందుకోసం దర్శకుడు క్రిష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆర్టిస్టులను సెలెక్ట్ చేసుకున్నాడు. అవసరమైతే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. అటు బాలయ్య కూడా క్రిష్ చెప్పిట్టు మాత్రమే వింటూ సినిమా అద్భుతంగా, వేగంగా రావడానికి పూర్తిగా సహకరిస్తున్నాడని ఎంటైర్ యూనిట్ చెప్పుకుంటోంది. ఈ క్రమంలో సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నాం అని చెప్పి షాక్ ఇచ్చాడు క్రిష్. ఒక భాగంలో ఆయన నటయానం ఉంటే.. మరో భాగంలో దాన్ని కొనసాగిస్తూ.. చివరికి పొలిటికల్ ఎంట్రీ ముఖ్యమంత్రి కావడం వరకూ చూపిస్తారు. ఇందుకు టైటిల్స్ కూడా పెట్టారు. ఫస్ట్ పార్ట్ కు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అని రెండో  భాగానికి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ అని. ఇక ఈ రెండు భాగాలను జనవరి 9న ఒకటి.. జనవరి 24న ఒకటి విడుదల చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్తల ప్రకారం ‘‘ఎన్టీఆర్’’ పోస్ట్ పోన్ అవుతుందట. 

నిజానికి క్రిష్ ప్లానింగ్ ను బట్టి చూస్తే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ కొన్ని పాత్రలు ఇంకా సెట్ కాలేదని టాక్. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందంటున్నారు. మరోవైపు ఇప్పుడు ఎన్నికలు కూడా ఉన్నాయి కదా.. బాలయ్య ఓ వారం రోజులు ప్రచారానికి ‘డేట్స్’ ఇచ్చాడట. దీంతో ఆ వారం రోజులు షూటింగ్ లేట్ అవుతుంది. దీంతో అనుకున్నట్టుగా రెండో భాగాన్ని జనవరి 24న తీసుకురావడం కష్టం అనుకుంటున్నారట. అందుకే ఆ భాగాన్ని మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నట్టు టాక్. మరోవైపు జనవరి 24 నుంచి 26 వరకూ బాలీవుడ్ నుంచి కొన్ని భారీ సినిమాలు కూడా వస్తున్నాయి. అదీ ఓ కారణం అనే గుసగుసలూ లేకపోలేదు. బట్.. వాళ్లు చెబుతున్నట్టు ఎన్నికల రీజన్ పర్ఫెక్ట్ గా ఉంది. అయినా అంత హడావిడీగా వచ్చే కంటే కాస్త గ్యాప్ తీసుకుని పర్ఫెక్ట్ గా రావడమే బెటర్. 

More Related Stories