English   

బాహుబ‌లి దారిలో ఎన్టీఆర్ బ‌యోపిక్.. 

NTR-biopic
2018-11-22 09:42:41

ఎన్టీఆర్ బ‌యోపిక్ పై ఇప్పుడు ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో.. ఎంతటి ఆస‌క్తి ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆస‌క్తిగా చూస్తున్నారు అభిమానులు. మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ కూడా అన్న‌గారి ఆత్మ‌క‌థ కోసం చూస్తున్నారు. ఈ చిత్రంతోనే త‌మ ఎన్నిక‌ల ప్ర‌భావం కూడా పెరుగుతుంద‌ని భావిస్తుంది ప‌సుపుప‌చ్చ పార్టీ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి బాల‌య్య కాస్త బ్రేక్ తీసుకున్నాడు. డిసెంబ‌ర్ 7నే ఎన్నిక‌లు ఉండ‌టంతో ప్ర‌చారంతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే క‌థానాయకుడు షూటింగ్ పూర్త‌యింది. ఇందులో 63 గెట‌ప్స్ లో క‌నిపిస్తున్నాడు బాల‌య్య‌. ఈ మ‌ధ్యే తోట‌రాముడు పాట‌ను కూడా పూర్తి చేసాడు క్రిష్. రానా, నిత్యామీన‌న్, విద్యాబాల‌న్, సుమంత్, ర‌కుల్, శ్రీయ‌, మాళ‌విక న‌య్య‌ర్.. ఇలా చాలామంది ప్ర‌ముఖులు ఇందులో న‌టిస్తున్నారు. ఇకిప్పుడు క‌థానాయ‌కుడు ఆడియో వేడుక తిరుప‌తి వేదిక‌గా జ‌ర‌గ‌బోతుంది. బాహుబ‌లి ఆడియో వేడుక అక్క‌డ జ‌రిగిన నాటి నుంచి మ‌న హీరోల‌కు తిరుప‌తి సెంటిమెంట్ అయిపోయింది. వ‌ర‌స‌గా చాలా వ‌ర‌కు అక్క‌డే ఆడియో వేడుక‌లు చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబ‌ర్ 16న ఎన్టీఆర్ ఆడియో వేడుక కూడా అక్క‌డే జ‌ర‌గ‌బోతుంది. దీనికి టాలీవుడ్ ప్ర‌ముఖులు చాలా మంది రానున్నారు. అలాగే రాజ‌కీయ నేత‌లు కూడా హాజ‌రు కానున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఈ వేడుక జ‌ర‌గ‌నుండ‌టంతో ప్రాధాన్యత సంత‌రించుకుంది. క‌థానాయ‌కుడు అనుకున్న‌ట్లుగానే జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది.. అయితే రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న మ‌హానాయ‌కుడు మాత్రం జ‌న‌వ‌రి 24న వ‌స్తుందా రాదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

More Related Stories