English   

సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం ట్రైల‌ర్.. సీక్వెల్ ఆఫ్ కార్తికేయ‌..

Subrahmanyapuram-Trailer
2018-11-22 12:03:11

అదేంటి.. చేస్తే గీస్తే నిఖిల్ చేయాలి కానీ.. సుమంత్ చేయ‌డం ఏంటి..? అయినా కార్తికేయ 2 తామే చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు చందూమొండేటి కూడా ప్ర‌క‌టించాడు క‌దా ఇప్పుడు సుమంత్ ఎలా వ‌చ్చాడు అనుకుంటున్నారా..? వ‌చ్చాడు అంతే.. కొన్ని సినిమాలు చూస్తుంటే తెలియ‌కుండానే మ‌రికొన్ని సినిమాలు గుర్తొస్తుంటాయి. ఇప్పుడు సుమంత్ న‌టిస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత కార్తికేయ సినిమా వ‌ద్ద‌న్నా గుర్తొస్తుంది. టీజ‌ర్ తోనే ఆస‌క్తి రేకెత్తించినా కూడా అదే స‌మ‌యంలో అనుమానాలు కూడా తెప్పించాడు ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌మూడి. అప్పుడే కార్తికేయ సినిమా మాదిరి అనిపించింది. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత అన్నీ క‌న్ఫ‌ర్మేష‌న్లు వ‌చ్చేసాయి. ఇది క‌చ్చితంగా కార్తికేయ సీక్వెల్ అనిపిస్తుంది. 

గ‌తంలో సుమంత్ సినిమాల‌తో పోలిస్తే చాలా రీ ఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇది సుమంత్ కు 25వ సినిమా కావ‌డం విశేషం. ఓ ఊరు.. ఓ గుడి.. అందులో స‌స్పెన్స్.. ఆ గుడి తెలుసుకోవాల‌నుకునే వాళ్లంతా చ‌చ్చిపోతుంటారు.. సేమ్ టూ సేమ్ కార్తికేయ క‌థ‌లో కూడా ఉంది. ఇదే క‌థ‌ను సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర స్వామి సాక్షిగా తీస్తున్నాడు సుమంత్. ఇప్పుడు సుమంత్ ఏం చేస్తున్నాడో తెలియ‌దు కానీ క‌చ్చితంగా కార్తికేయ పోలిక‌లు మాత్రం బాగానే క‌నిపిస్తున్నాయి. పైగా ఇందులో హీరో పేరు కూడా కార్తిక్ కావ‌డం విశేషం. పురావ‌స్తు గుడుల గురించి తెలుసుకునే ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు సుమంత్. డిసెంబ‌ర్ లో విడుద‌ల కానంఉది ఈ చిత్రం. తెలుగ‌మ్మాయి ఇషారెబ్బ ఇందులో హీరోయిన్. పోలిక‌లు ట్రైల‌ర్ వ‌ర‌కు అయితే ఓకే కానీ సినిమా వ‌ర‌కు కూడా కంటిన్యూ అయితే క‌ష్టాలు త‌ప్ప‌వు. 

More Related Stories