English   

వ‌డివేలు.. బుద్ధి కుక్క‌తోక వంక‌రే.. 

Vadivelu
2018-11-22 12:35:37

కొంద‌ర్ని చూస్తుంటే తెలియ‌కుండానే ఈ మాట అనాల‌నిపిస్తుంది. ఇప్పుడు వ‌డివేలుకు కూడా ఇదే స‌రిపోతుంది. ఈ క‌మెడియ‌న్ కు ఇంకా కొవ్వు త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ అదే బ‌లుపు చూపిస్తూనే ఉన్నాడు. అయినా మ‌నిషికి అన్నింటికంటే పెద్ద షాక్ గుణ‌పాఠం. ఓ సారి షాక్ త‌గిలిన త‌ర్వాత దాన్నుంచి ఏం నేర్చుకోక‌పోతే అంత‌కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. వ‌డివేలు విష‌యంలో ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది. అప్ప‌ట్లో ర‌జినీకాంత్ పై నోటికొచ్చిన క‌మెంట్స్ చేసి అడ్డంగా బుక్క‌య్యాడు. అప్పుడు తొక్కితే ఐదేళ్ళు ఖాళీగా ఉండి ఈ మ‌ధ్యే మ‌ళ్లీ బిజీ అవుతున్నాడు. మెర్స‌ల్ లో న‌టించి మున‌ప‌టి ఫామ్ అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. 

అంత‌లోనే ఈయ‌న‌పై మ‌ళ్లీ షాకింగ్ రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. మ‌నోడిలో ఇంకా మార్పు రాలేద‌ని.. మున‌ప‌టిలా అలాగే బ‌లుపు చూపిస్తున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం శంక‌ర్ శిష్యుడు చింబుదేవన్ ద‌ర్శ‌క‌త్వంలో హింసించే 24వ రాజు పులికేశి సీక్వెల్ చేస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ కు త‌గ్గ‌ట్లే వ‌డివేలు వాళ్ల‌ను హింసిస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫెరెన్సులు అంటూ క‌థ‌లో వేలు పెట్టి చంపేస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ విష‌యంపై నిర్మాత శంక‌ర్ కూడా సీరియ‌స్ గా ఉన్నాడు. దాంతో త‌మిళ నిర్మాత‌ల మండలికి వ‌డివేలుపై ఫిర్యాదు చేసాడు శంక‌ర్. దాంతో త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ ఈయ‌న్ని బ్యాన్ చేసింది. 

పులికేశి సెట్ లో వడివేలు, చింబుదేవన్ మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఎలాగోలా స‌ర్దుకుని శంక‌ర్ తో పాటు లైకా ప్రొడ‌క్ష‌న్స్ కూడా సినిమా నిర్మాణంలో యాడ్ అయింది. దాంతో చింబుదేవ‌న్ ఈ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని కావాల‌నే పెద్ద‌ది చేసి షూట్ ఆగ‌డానికి కార‌ణం అవుతున్నాడు వ‌డివేలు. వడివేలు ప్రవర్తనపై శంక‌ర్ కూడా చాలా సీరియ‌స్ గా ఉన్నాడ‌ని తెలుస్తోంది. షూటింగ్‌కు సరైన టైమ్ కు రాక‌పోవ‌డం.. రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్న‌ట్లు వ‌డివేలుపై కంప్లైంట్స్ వ‌స్తున్నాయి. మొత్తానికి వ‌డివేలు బుద్ధి ఎప్ప‌టికి మారుతుందో అని ఇప్పుడు ఆయ‌నపై త‌మిళ ఇండ‌స్ట్రీలో బానే సెటైర్లు పేలుతున్నాయి. 

More Related Stories