English   

వెంకీ మామా ఇంకా ఆల‌స్యం.. అస‌లు కార‌ణ‌మ‌దే..!

Venky-Mama
2018-11-22 13:05:48

తెలుగులో ఇప్పుడు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చాలానే వ‌స్తున్నాయి. ముఖ్యంగా సీనియ‌ర్ హీరోలు వీటిని బాగానే ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు వెంక‌టేష్ ఇప్పుడు చేస్తోన్న ఎఫ్ 2 కానీ.. చిరంజీవి సైరా కానీ అన్నీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలే. ఇదే దారిలో ఇప్పుడు వెంకీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. మేన‌ల్లుడు నాగ‌చైత‌న్యతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వెంక‌టేష్. ప్రేమ‌మ్ లో కాసేపు మామ‌గా క‌నిపించి మాయం అయిపోయాడు వెంక‌టేష్. ఇప్పుడు పూర్తిగా ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా వెంకీమామ‌. ఈ చిత్ర ఓపెనింగ్ జ‌రిగి కూడా నెల రోజులు దాటేసింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాలేదు. జై ల‌వ‌కుశ త‌ర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని బాబీ చేస్తోన్న సినిమా ఇది. పూర్తిగా గ్రామ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇందులో చైతూకు జోడీగా ర‌కుల్.. వెంకీకి జోడీగా కాలా ఫేమ్ హ్యూమాఖురేషీ న‌టిస్తున్నారు. 

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంట‌ర్టైనర్ గా వెంకీ మామాను తెర‌కెక్కించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఈ సినిమాకు కూడా కోన వెంక‌ట్ త‌న ర‌చ‌నా స‌హ‌కారం అందించాడు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి. వెంకీ మామా కోసం అప్ప‌ట్లో త‌న సినిమాల‌ను కూడా ప‌క్క‌న‌బెట్టాడు నాగ‌చైత‌న్య‌. అయితే ఆశ‌లు పెట్టుకున్న శైల‌జారెడ్డి అల్లుడు.. స‌వ్య‌సాచి రెండూ ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు చైతూ ఆలోచిస్తున్నాడు. అందుకే కాస్త ఆల‌స్యం అయినా ప‌ర్లేదు కానీ క‌థ‌లో మ‌ళ్లీ ప‌క్కాగా అన్ని చూసుకున్న త‌ర్వాత కానీ వెంకీమామ ప‌ట్టాలెక్కించ‌డానికి ఒప్పుకోవ‌డం లేదు చైతూ. అల్లుడికే వెంక‌టేష్ స‌పోర్ట్ కూడా ఉంది. దాంతో ఇప్ప‌ట్లో వెంకీమామా ప‌ట్టాలెక్క‌డం కాస్త క‌ష్ట‌మే. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుందో..? 

More Related Stories