English   

స‌మంత‌, చైతూ మ‌జిలి స‌గం పూర్త‌యింది.. 

Naga-Chaitanya
2018-11-23 11:07:47

ఏడాది కింది వ‌ర‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించినా కూడా క్రేజ్ ఉండేది కానీ మ‌రీ ఇంత క్రేజ్ అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్లు రీల్ లైఫ్ క‌పుల్ కాదు.. రియ‌ల్ లైఫ్ క‌పుల్. అందుకే నాగ‌చైత‌న్య, స‌మంత క‌లిసి సినిమా చేస్తున్నారంటే ఇంత ఆస‌క్తి.. ఇన్ని అంచ‌నాలు. వీళ్లిద్ద‌ర్ని పెళ్లి త‌ర్వాత క‌లిపి చూపించాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ట్రై చేసారు. కానీ మ‌న‌సును తాకే క‌థ వ‌చ్చేవ‌ర‌కు క‌చ్చితంగా క‌లిసి న‌టించం అని చెప్పాడు నాగ‌చైత‌న్య‌. అలాంటి క‌థ తీసుకురావ‌డానికి చాలా మంది ద‌ర్శ‌కులు ట్రై చేసినా చైతూను మాత్రం మెప్పించ‌లేక‌పోయారు. ఇప్పుడు నిన్నుకోరి ఫేం శివ‌నిర్వాన ఇది చేసాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఏ మాయ చేసావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం లాంటి సినిమాల త‌ర్వాత ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేష‌న్ ను త‌న క‌థ‌తో మ‌రింత క్రేజీగా మార్చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శివనిర్వాన‌. కొన్ని రోజులుగా వైజాగ్ లో జ‌రుగుతున్న షెడ్యూల్ ఇప్పుడు పూర్తైపోయింది. 

న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. నవంబ‌ర్ 23న నాగ‌చైత‌న్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా షూటింగ్ అప్ డేట్స్ చెప్పారు చిత్ర‌యూనిట్. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం షూటింగ్ పూర్తైపోయింది. దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తుంది.. త‌ణికెళ్ళ భ‌ర‌ణి, రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుదల కానుంది. నిన్నుకోరి త‌ర‌హాలోనే ఇది కూడా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గానే ఉండ‌బోతుంద‌ని చెబుతున్నాడు శివ‌. క‌చ్చితంగా ఈ చిత్రంతో ద్వితీయ‌విఘ్నం దాటేస్తాన‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు చైతూ, స‌మంత‌కు కూడా క‌చ్చితంగా హిట్ కావాలి. మ‌రి చూడాలిక‌.. ఈ మ‌జిలితో వాళ్లేం చేస్తారో..? 

More Related Stories