English   

గోవాలో పార్టీ.. భార్య‌తో చైతూ కోలాహ‌లం..

Naga-Chaitanya
2018-11-24 10:00:49

అస‌లే కొత్త జంట‌.. ఆపై రొమాన్స్ కు పెట్టింది పేరైన అక్కినేని కుటుంబం.. గోవాలో పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.. ఇంత‌కంటే ఏం కావాలి..? అదేం పిచ్చో తెలియ‌దు కానీ ఏం ఎమోష‌న్ వ‌చ్చినా ముందు గోవాకు ప‌రుగులు తీస్తుంటారు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌. వీళ్ల పెళ్లి కూడా అక్క‌డే జ‌రిగింది. గోవా అంటే వీళ్ల‌కు ప్రాణం. పెళ్లికి ముందు చేసుకున్న బ్యాచ్ ల‌ర్ పార్టీలు అన్నీ అక్క‌డే. ఇక కొత్త ఏడాది కూడా గోవాలోనే సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు చైతూ బ‌ర్త్ డే సంబ‌రాలు కూడా అక్క‌డే జ‌రిగాయి. మ‌న ఇండ‌స్ట్రీ నుంచి ల‌క్ష్మీ మంచు లాంటి వాళ్లు కూడా చైతూతో పాటు వెళ్లారు. అక్క‌డే సూప‌ర్ గా ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది స‌మంత‌. భ‌ర్త‌కు అదిరిపోయే స్టైల్ లో విషెస్ చెప్పింది. పెళ్లైనా కూడా  స్టైల్ మార్చుకోన‌ని భ‌ర్త సాక్షిగానే చూపించింది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డ కూడా బాగానే అందాలు ఆర‌బోసింది. చైతూ కూడా చూసి చూడ‌న‌ట్లుగా స్యామ్ వైపు చూస్తున్నాడంతే. న‌వంబ‌ర్ 23, 2018తో అక్కినేని నాగచైతన్య 32వ ఏట అడుగు పెట్టాడు. భార్య‌, ఫ్రెండ్స్ తో క‌లిసి జ‌రుపుకున్న ఈ బ‌ర్త్ డే చాలా స్పెష‌ల్ అంటున్నాడు చైతూ. వీళ్ల పెళ్లి జ‌రిగిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌తీ చిన్న వేడుక‌కు కూడా గోవా వెళ్లి ఎంజాయ్ చేసి వ‌స్తున్నారు ఈ జంట‌. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి మ‌జిలి సినిమా షూటింగ్ కు నాలుగు రోజులు బ్రేక్ ఇచ్చారు. వాళ్లు తిరిగి రాగానే న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఎంజాయ్ మెంట్ చేస్తూనే ఉంటారు కొత్త‌జంట‌.   

More Related Stories