English   

రామ్ చ‌ర‌ణ్ లో విన‌యం ఇప్పుడు క‌నబ‌డింది..

Vinaya-Vidheya-Rama
2018-11-24 10:54:42

టైటిల్ చూస్తేనేమో విన‌య విధేయ రామ‌.. కానీ టీజ‌ర్ చూస్తుంటే మాత్రం ఒక్కొక్క‌ర్ని కాదు షేర్ ఖాన్ 100 మందిని ర‌మ్మ‌ను అన్న‌ట్లు మ‌గ‌ధీర రేంజ్ యాక్ష‌న్ గుర్తులు. అస‌లు టీజ‌ర్ కు టైటిల్ కు ఎక్క‌డా పొంతన కూడా లేదు. పైగా టీజ‌ర్ కూడా చాలా యావ‌రేజ్ గా ఉందంటూ విన‌య విధేయ రామ‌పై చాలానే రొటీన్ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దాంతో అక్క‌డుండానే వ‌రం ఇచ్చేసాడు చ‌రణ్. కార్తిక పౌర్ణ‌మి కానుక‌గా అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసాడు. ఇందులో చాలా విన‌యంగా ఉన్నాడు ఈ రాముడు. ఇప్పుడు టైటిల్ కు పూర్తి న్యాయం చేసాడు రామ్ చ‌ర‌ణ్. చాలా ఒద్దిక‌గా ప‌ద్ద‌తిగా.. చేతులు క‌ట్టుకుని దీపాన్ని మొక్కుతూ విన‌యంగా విధేయంగా ఉన్నాడు. ఇది చూసిన త‌ర్వాత ఇప్పుడు ఈ టైటిల్ విన‌య విధేయ రామ అంటే ఒప్పుకునేలా ఉంది. కానీ టీజ‌ర్ మాత్రం అలా కాదు. సినిమాలో కూడా ఫ్యామిలీ ఎమోష‌న్స్ చాలానే ఉన్నాయంటున్నాడు బోయ‌పాటి శ్రీను. అస‌లే క‌థే ప‌క్కా కుటుంబ క‌థా చిత్రం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న ఎమోష‌న్స్ అన్నీ ర‌క్త‌లొచ్చేలా ఉంటాయి. అవి ఎక్కితే బ్లాక్ బ‌స్ట‌రే లేదంటే అంతే సంగ‌తులు. అయితే బోయ‌పాటి లెక్క ఇప్ప‌టి వ‌ర‌కు మ్యాగ్జిమ‌మ్ త‌ప్ప‌లేదు. ఆ మ‌ధ్య ఓసారి ద‌మ్ము.. మొన్న జ‌య జాన‌కీ నాయ‌కా త‌ప్పిస్తే అన్ని సినిమాలు బాగానే ఆడాయి. దాంతో ఇప్పుడు సంక్రాంతికి రాబోయే విన‌య విధేయ రామ కూడా కుమ్మేయ‌డం ఖాయం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ బ‌యోపిక్ కు పోటీగా ఈ చిత్రం రానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ విన‌య విధేయ రామ ఆ యుగ‌పురుషుడి జోరును ఎలా అడ్డుకుంటుందో..? 

More Related Stories