English   

ఆర్ఆర్ఆర్ షూటింగ్.. ఆకాశ‌మే హ‌ద్దు.. 

RRR-Shooting
2018-11-24 11:24:14

రాజ‌మౌళి సినిమా అంటే ఇప్పుడు ఆకాశం ఒక్క‌టే హ‌ద్దు. అంత‌కంటే ఎత్తు లేదు కాబ‌ట్టి బ‌తికిపోయింది కానీ లేక‌పోతే దానికంటే మించిన అంచ‌నాలు కూడా ఉండేవేమో..? ఇప్పుడు ఈయ‌న తెర‌కెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ గురించి దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పుడు వేగంగా జ‌రుగుతుంది. తొలి షెడ్యూల్ లో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఉన్నారు. ఇదిలా ఉంటే నెక్ట్స్ షెడ్యూల్ కోసం అప్పుడే భారీ సెట్ల నిర్మాణం కూడా జ‌రుగుతుంది. సిబిఐటి స‌మీపంలో కొన్ని వంద‌ల ఎక‌రాల‌లో భారీ సెట్టింగులు నిర్మాణం జ‌రుగుతుంది. అక్క‌డే మూడు నెల‌లు భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. జ‌న‌వ‌రి నుంచి అక్క‌డ షూటింగ్ చేయాల‌ని చూస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఆర్ఆర్ఆర్ తొలి షెడ్యూల్ మ‌రో ప‌ది రోజుల్లో పూర్తి కానుంది. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ మ‌ళ్లీ బోయ‌పాటి శ్రీను విన‌య విధేయ రామ‌తో బిజీ కానున్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ జ‌న‌వ‌రి నుంచి ఆర్ఆర్ఆర్ తో భాగం కానున్నాడు. మ‌రోవైపు ఎన్టీఆర్ మాత్రం పూర్తి టైమ్ రాజ‌మౌళికే ఇచ్చాడు. ఒక్క‌సారి విన‌య విధేయ రామ పూర్తైందంటే పూర్తిగా త‌న టైమ్ చ‌ర‌ణ్ దీనికే కేటాయించ‌నున్నాడు. జ‌న‌వ‌రి నుంచి నాన్ స్టాప్ 90 డేస్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. వ‌చ్చే ఏడాది టాకీ పూర్తి చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు రాజ‌మౌళి. 2020 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్ర బ్యాక్ డ్రాప్ స్వ‌తంత్ర్యం పూర్వం నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది. ఇప్పుడు సెట్స్ చూస్తుంటే ఇదే నిజం అయ్యేలా క‌నిపిస్తుంది కూడా.

More Related Stories