English   

నానికి హ్యాండిచ్చిన రాజ‌మౌళి.. కీర్తిసురేష్ షాక్.. 

Keerthy-Suresh-Nani
2018-11-24 14:55:37

అస్స‌లు అర్థం కాలేదు క‌దా.. అస‌లు నాని ఏంటి.. కీర్తిసురేష్ ఏంటి మ‌ధ్య‌లో రాజ‌మౌళి ఎందుకొచ్చాడు ఇవ‌న్నీ చాలా క‌న్ఫ్యూజ‌న్స్ ఉన్నాయి క‌దా. ఏం లేదు ఈక్వెష‌న్ చాలా సింపుల్. ఇప్పుడు రాజ‌మౌళి ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ లోనే ఇప్పుడు చ‌ర‌ణ్, ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. మ‌రోవైపు నానికి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు కానీ రాజ‌మౌళి సినిమా వ‌ల్ల ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ కు షాక్ త‌ప్ప‌ట్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కీర్తిసురేష్ ను ఓ హీరోయిన్ గా తీసుకునే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చిందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాలేవీ ఒప్పుకోవ‌డం లేదు ఈ భామ‌. అస‌లు మ‌హాన‌టి విడుద‌లైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో కీర్తి క‌నిపించ‌లేదు. దానికి తోడు అన్నీ ఆయా గ‌యా రోల్స్ చేస్తుండ‌టం కూడా ఈమెకు న‌చ్చ‌డం లేదు. దాంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో త‌న స‌త్తా చూపించాల‌ని ఫిక్సైపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇందులో భాగంగానే ఇప్పుడు రాజ‌మౌళి సినిమా కోసం నాని సినిమా ఆఫ‌ర్ నో చెప్పింద‌ని తెలుస్తుంది. నాని-చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా అనుకున్నా కూడా కుద‌ర్లేదు. ఆర్ఆర్ఆర్ కార‌ణంగానే ఈ భామ నాని సినిమాకు నో చెప్పింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అలా నేనులోక‌ల్ కాంబినేష‌న్ ను విడ‌దీసి నానికి షాక్ ఇచ్చాడు రాజ‌మౌళి.

More Related Stories