English   

 ఫ్యాన్ చేసిన ప‌నికి షాక్ అయిన హ‌న్సిక‌.. 

Hansika-Motwani
2018-11-24 15:26:06

హీరోయిన్ అన్న త‌ర్వాత ఫ్యాన్స్ నుంచి బోలెడు ల‌వ్ లెట‌ర్స్ వ‌స్తూనే ఉంటాయి. ఎవ‌రికి వాళ్లు త‌మ ప్రేమ‌ను చూపిస్తూనే ఉంటారు. సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత ఇప్పుడు మ‌రింత తాకిడి ఎక్కువైపోయింది ముద్దుగుమ్మ‌ల‌కు ఈ ప్రేమ‌లేఖ‌ల ర‌చ్చ‌. ఇప్పుడు హ‌న్సిక విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. అయితే అంద‌రు ఫ్యాన్స్ ఒక‌లా ఉండ‌రు.. ఓ క్రేజీ అభిమాని త‌న లెట‌ర్ తో హ‌న్సిక మ‌న‌సు గెలుచుకున్నాడు. అస‌లే హ‌న్సిక‌కు త‌మిళ‌నాట గుడి క‌ట్టేంత ఫ్యాన్స్ ఉన్నారు. అక్క‌డ ఐదారేళ్ల పాటు చ‌క్రం తిప్పింది హన్సిక. ఏ సినిమాలో చూసినా ఈ భామే క‌నిపించింది. ఇప్పుడు హ‌న్సిక‌ను చూసి ఓ అభిమాని నువ్వే నా జీవితం అంటూ రాసుకొచ్చాడు. హ‌న్సిక నువ్వు లేక నేను లేను.. నువ్వే నా జీవితం అనేది ఒక్క‌టి కాదు ఏకంగా 28 భాషల్లో రాసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. అది కూడా హ‌న్సిక చూసేలా.. ఆమెకు తెలిసేలా. అందులో హన్సిక నా జీవితం అంటూ తెలుగులో.. హన్సిక మై లైఫ్ అని ఇంగ్లీష్‌లో.. హన్సిక ఎన్ వాళ్‌క్కై అని తమిళంలో.. మ‌రో 25 భాష‌ల్లో కూడా రాసుకొచ్చాడు. ఇది చూసి హ‌న్సిక కూడా షాక్ అయింది. త‌న‌పై అభిమాని చూపించిన ప్రేమ‌తో ఫిదా అయిపోయింది. ఇక హ‌న్సిక కూడా ఇది చూసి చాలా విభిన్నంగా ఉంది... ధన్యవాదాలు అని ఆ అభిమానికి సమాధానమిచ్చింది. మొత్తానికి ఇలా ఫ్యాన్స్ కొన్నిసార్లు చేసే ప‌నులు చాలా క్రేజీగా ఉంటాయి.

More Related Stories