English   

రెండు నెల‌లు.. రెండు సినిమాలు.. ర‌జినీ సంచ‌ల‌నం.. 

rajinikanth
2018-11-24 17:36:42

ర‌జినీకాంత్ అంటే మూడేళ్ల‌కో సినిమా చేయాలి.. అలా చేసిన‌పుడే ఆయ‌న కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తుంటారు. కానీ ఇప్పుడు ర‌జినీ రూట్ మార్చాడు. వ‌య‌సు 70కి చేరువ‌వుతుంటే.. ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్ప‌టికే కాలా అంటూ వ‌చ్చాడు.. ఆ త‌ర్వాత ఇప్పుడు 2.0తో వ‌స్తున్నాడు.. సంక్రాంతికి పేట్టతో దిగుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ అయితే అనుకున్న టైమ్ కంటే 15 రోజుల ముందుగానే పూర్తి చేసాడు ర‌జినీ. కార్తిక్ సుబ్బ‌రాజ్ ప‌క్కా ప్లానింగ్ తో పెట్ట షూటింగ్ పూర్తి చేసాడు. వ‌ర‌స సినిమాలు చేస్తున్నాడు కానీ రాజ‌కీయాల మాట వ‌చ్చేస‌రికి సైలెంట్ అయిపోతున్నాడు ఈ హీరో. ఆ మ‌ధ్య భ‌ర‌త్ అనే నేనులో మ‌హేశ్ బాబు మాదిరి అంద‌రి సాక్షిగా అంతఃక‌ర‌ణ శుద్ధితో తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు ర‌జినీ కాంత్. కానీ అవ‌న్నీ మాట‌ల వ‌ర‌కే కానీ చేత‌ల్లో కాద‌ని ఇప్పుడు నిరూపిస్తున్నాడు సూప‌ర్ స్టార్.  ఈయ‌న తీరు చూస్తుంటే అస‌లు రాజ‌కీయాల‌పై ఇష్ట‌మే లేన‌ట్లు క‌నిపిస్తుంది. వాటిని సీరియ‌స్ గా కూడా తీసుకోవ‌డం లేదు ఈయ‌న‌. ర‌జినీకాంత్ కు పాలిటిక్స్ ఇష్టం లేవ‌ని తెలుసు.. ఎప్ప‌ట్నుంచో చెబుతున్న మాటే కానీ వ‌స్తాన‌ని చెప్పిన త‌ర్వాత కూడా ఇంకా ఇష్టం లేన‌ట్లుండ‌టం అభిమానుల‌ని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం. లేక‌పోతే మ‌రేంటి..? ఓ వైపు ఎన్నిక‌ల టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఈయ‌న మాత్రం సినిమాలు చేస్తూ ఉన్నాడు. అన్ని పార్టీలు త‌మ త‌మ క్యాడ‌ర్ల‌ను సిద్ధం చేసుకుంటుంటే ర‌జినీ మాత్రం సినిమాలు సిద్ధం చేసుకుంటున్నాడు. కాలా త‌ర్వాత ఇప్పుడు న‌వంబ‌ర్ 29న 2.0 రెడీగా ఉంది.. కార్తిక్ సుబ్బ‌రాజ్ పెట్ట సినిమా సంక్రాంతికి రానుంది. రెండు నెల‌ల గ్యాప్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు ర‌జినీకాంత్. ఇది క‌చ్చితంగా ర‌జినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఇక డిసెంబ‌ర్ 9న పేట్ట ఆడియో వేడుక జ‌ర‌గ‌బోతుంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. పేట్ట‌లో కూడా మాఫియా డాన్ గా న‌టిస్తున్నాడు సూప‌ర్ స్టార్. మ‌రి హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో వెన‌క‌బ‌డిన ర‌జినీకాంత్.. ఈ రెండు సినిమాల‌తో ఎలాంటి ర‌చ్చ చేస్తాడో చూడాలిక‌..

More Related Stories