English   

క‌న్న‌డ సూప‌ర్ స్టార్ అంబ‌రీష్ క‌న్నుమూత‌..

Ambareesh-death
2018-11-25 07:26:32

ప్రముఖ సినీనటుడు.. క‌న్న‌డ రెబ‌ల్ స్టార్.. కాంగ్రెస్‌ నేత అంబరీష్ కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఈయ‌న బెంగళూరులోని విక్ర‌మ్ హాస్పిట‌ల్లో చికిత్స పొందుతూ న‌వంబ‌ర్ 24 రాత్రి తుదిశ్వాస విడిచారు. 1952 మే 29న మైసూర్‌ రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో జన్మించారు. 1972లో త‌న ప్రాణ స్నేహితుడు విష్ణువ‌ర్ధ‌న్ హీరోగా న‌టించిన నాగరాహవు సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు అంబ‌రీష్. ఈయ‌న అస‌లు పేరు మాల‌వ‌ల్లి హుచ్చే గౌడ అమ‌ర్ నాథ్. సినిమాల్లోకి వ‌చ్చిన అంబ‌రీష్ గా పేరు మార్చుకున్నారు. ఈయ‌న ప్ర‌ముఖ సినీ న‌టి సుమలతను 1991లో పెళ్లి చేసుకున్నారు. సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబరీష్‌ అనంతరం రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌ తరఫున కర్ణాటక ఎన్నికల్లో గెలిచి 2013లో ఆ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. క‌న్న‌డనాట హీరోగా అత్య‌ధిక సినిమాలు చేసిన రికార్డ్ అంబ‌రీష్ పేరు మీదే ఉంది. ఈయ‌న 207 సినిమాల్లో లీక్ యాక్ట‌ర్ గా న‌టించారు. ఇంత‌కుముందు లెజెండ‌రీ న‌టుడు రాజ్ కుమార్ పేరు మీదున్న రికార్డును త‌న పేర రాసుకున్నాడు అంబ‌రీష్.ఈ విష‌యంలో విష్ణువ‌ర్ధ‌న్ తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ళ‌యాల భాష‌ల్లో క‌లిపి 230 సినిమాల్లో హీరోగా న‌టించారు. అంబ‌రీష్ కెరీర్ లో ఎన్నో మ‌రుపురాని సినిమాలు ఉన్నాయి. పాండ‌వార‌ల్లి పాండ‌వురు, శుభ‌మంగ‌ళ‌, మాసంద‌, రంగ‌నాయ‌కి లాంటి సినిమాలు అంబ‌రీష్ ను ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువ చేసాయి. సినిమా హీరోగానే కాదు.. రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా ఈయ‌న సంచ‌ల‌న‌మే. 1994లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన అంబ‌రీష్.. మూడుసార్లు ఎంపిగా.. ఓ సారి మంత్రిగానూ ప‌ని చేసారు. రాజ‌కీయ నాయ‌కుడిగా కూడా ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర చాలా మంది పేరు సంపాదించుకున్నారు ఈయ‌న‌. ఈయ‌న మృతిపై రాజ‌కీయ పార్టీల‌తో పాటు సినిమా వాళ్లు కూడా సంతాపం తెలియ‌జేస్తున్నారు. 

More Related Stories