English   

థ‌మ్స‌ప్ కోసం రిస్కైనా ఇష్కే అంటున్న మ‌హేష్.. 

Mahesh-Babu
2018-11-25 10:28:18

మ‌హేశ్ బాబు.. సినిమాల ప‌రంగా ఈయ‌న సూప‌ర్ స్టార్. అందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు. హిట్లు ఫ్లాపులు అనే ప‌దాల‌తో ప‌నిలేని ఇమేజ్ ఈయ‌న సొంతం. ఇప్పుడు ఈయ‌న సినిమా చేస్తే ఓపెనింగ్స్ రూపంలోనే రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం. అలాంటి మార్కెట్ ఉన్న మ‌హేష్ కోసం కార్పోరేట్ కంపెనీలు క్యూ క‌ట్ట‌డం పెద్ద ఆశ్చ‌ర్య‌మేం కాదు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. థ‌మ్స్ అప్ కు కొన్నేళ్లుగా ఎండోర్స్ చేస్తున్నాడు మ‌హేష్. ఈయ‌నతో వాళ్లు కొత్త కొత్త యాడ్స్ అన్నీ షూట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ కొత్త యాక్ష‌న్ యాడ్ చిత్రీక‌రించారు. దీన్ని విడుద‌ల చేసాడు మ‌హేష్ బాబు. ఒక్క కూల్ డ్రింక్ బాటిల్ కోసం యుద్ధాలు చేసాడు సూప‌ర్ స్టార్. ఇది చూసిన త‌ర్వాత అస‌లు ఇది యాడ్ అని ఎవ‌రంటారో కూడా అర్థం కావ‌డం లేదు. సినిమాల‌కు త‌గ్గ‌ట్లు విఎఫ్ఎక్స్ అదిరిపోయింది. సినిమాలు లేని టైమ్ లో కూడా యాడ్స్ చేసి శ్రీ‌మంతుడు అయ్యాడు మ‌హేష్ బాబు.

సినిమాల కంటే కూడా యాడ్స్ తోనే ఎక్కువ‌గా సంపాదిస్తున్నాడు సూప‌ర్ స్టార్. సౌత్ ఇండియాలో మ‌హేశ్ కంటే తోపు ఎవ‌రూ లేరు యాడ్స్ రంగంలో. ఎండోర్స్ మెంట్ చేయ‌డంలో మ‌హేశ్ ఆరితేరిపోయాడు. ఏడేళ్లుగా ఈయ‌న యాడ్ రంగాన్ని దున్నేస్తున్నాడు. బ‌న్నీ, చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు కూడా అప్పుడ‌ప్పుడూ యాడ్స్ చేస్తున్నా.. మ‌హేశ్ ముందు వాళ్లంతా దిగ‌దుడుపే. కేవ‌లం యాడ్స్ నుంచే ఏడాదికి క‌నీసం 20 కోట్ల‌కు పైగానే సంపాదిస్తున్నాడు మ‌హేశ్. ఇప్పుడు థ‌మ్స‌ప్ యాడ్ చూసిన త‌ర్వాత మ‌హేష్ కోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తారు ఈ కార్పోరేట్ కంపెనీలు అని మ‌రోసారి అర్థ‌మైపోయింది. ఇప్పుడు ఆయ‌న‌కు ఉన్న బ్రాండ్ అలా ఉంది మ‌రి. అందుకే త‌మ ప్రాడ‌క్ట్ ను మ‌హేశ్ చేతుల్లో పెడ‌తాయి కంపెనీలు. చెప్పుల నుంచి బంగారం వ‌ర‌కు.. కూల్ డ్రింక్ నుంచి స‌బ్బుబిల్ల వ‌ర‌కు అన్నీ మ‌హేష్ ముందుండి మ‌రీ ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఏదేమైనా ఎండోర్స్ మెంట్ చేయ‌డంలో మ‌హేష్ స్టైల్ వేర‌బ్బా. 

More Related Stories