English   

విక్ర‌మ్ పై కోటిన్న‌ర ఫైన్.. క‌డ‌తాడో లేదో..?

Vikram-Kumar
2018-11-26 10:21:35

విక్ర‌మ్ అంటే హీరో విక్ర‌మ్ కాదండోయ్.. మ‌న‌కు తెలిసిన విక్ర‌మ్ మ‌రొక‌రు కూడా ఉన్నారుగా.. అత‌డే విక్ర‌మ్ కే కుమార్. హ‌లో, 24, మ‌నం, ఇష్క్ లాంటి సినిమాలు ఈ ద‌ర్శ‌కున్ని స్టార్ గా మార్చేసాయి. ఇందులో మ‌నం, ఇష్క్ త‌ప్ప మిగిలిన రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా ఫ్లాప్. కానీ విక్ర‌మ్ కే కుమార్ సినిమా అంటే ఏదో తెలియ‌ని అంచ‌నాలు ఉంటాయి. ఇవే హీరోల‌ను కూడా ఈ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌రికి ప‌రుగులు పెట్టేలా చేస్తాయి. ఇకిప్పుడు ఈయ‌న తెలుగులో ఓ సినిమా చేయాల‌ని చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. బ‌న్నీతో సినిమా అనుకున్నా కూడా కుద‌ర్లేదు. అయితే ఈ ద‌ర్శ‌కుడిపై ఇప్పుడు కోటిన్న‌ర ఫైన్ వేసారు. దీనికి కార‌ణం అశ్వీనీద‌త్. ఇష్క్ సినిమా త‌ర్వాత త‌న బ్యాన‌ర్ లో చేయడానికి విక్ర‌మ్ కే కుమార్ కు  అడ్వాన్స్ ఇచ్చాడు అశ్వనీదత్. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వైజ‌యంతి బ్యానర్ లో విక్రమ్ సినిమా చేయలేదు.

మనం, 24, హలో ఇలా అన్నీ బ‌య‌టే చేసాడు. కానీ అశ్వనీదత్ తో మాత్రం కాంబినేష‌న్ కుద‌ర్లేదు. దాంతో ఇప్పుడు నానితో చేయాల‌నుకుంటున్న సినిమా త‌న  బ్యాన‌ర్ లో చేయాల‌ని ప‌ట్టు బ‌డుతున్నాడు అశ్వినీద‌త్. అలా కాని ప‌క్షంలో త‌న‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద కోటిన్న‌ర క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నాడు ఈ నిర్మాత‌. చాలా రోజుల నుండి ఫిల్మ్ ఛాంబర్.. దర్శకుల సంఘంలో ఈ విషయంపై చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు ఇవి ఓ కొలిక్కి వ‌చ్చి విక్ర‌మ్ కే కుమార్ పై ఫైన్ వేసే వ‌ర‌కు వెళ్లింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. తన రెమ్యునరేషన్ లో 1.5 కోట్లను అశ్వనీదత్ కి చెల్లించాలని తీర్పు ఇచ్చారు. అయితే దీనికి విక్ర‌మ్ నుంచి ఎలాంటి స‌మాధానం రాలేదు. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు విక్ర‌మ్ కే కుమార్ ఏం అంటాడో..? 

More Related Stories