English   

చిరంజీవి త‌ర్వాత అఖిలే.. భలే రికార్డే ఇది.. 

Ram-Charan
2018-11-26 14:13:15

ఏంటి చిరంజీవి త‌ర్వాత అఖిలా... అస‌లు ఈ ఇద్ద‌రికి పోటీ ఎక్క‌డ‌..? మెగాస్టార్ ఎక్క‌డ‌.. అఖిల్ ఎక్క‌డా అనుకుంటున్నారా..? ఇప్పుడు ఈ ఇద్ద‌రిని క‌లిపే బాధ్య‌త రామ్ చ‌ర‌ణ్ తీసుకున్నాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు కొణిదెల బ్యాన‌ర్ లో చిరంజీవి త‌ప్ప బ‌య‌టి హీరోలు చేయ‌నే లేదు. కేవ‌లం మెగాస్టార్ కోస‌మే ఈ నిర్మాణ సంస్థ పెట్టాడా చ‌ర‌ణ్ అంటూ సెటైర్లు కూడా వ‌చ్చాయి. క‌నీసం త‌న కుటుంబ హీరోల‌తో కూడా సినిమా చేయ‌లేదు రామ్ చ‌ర‌ణ్. ఇప్ప‌టికే ఖైదీ నెం.150 అయిపోయింది.. ఇప్పుడు సైరా వ‌స్తుంది.. కొర‌టాల శివ‌-చిరంజీవి సినిమా కూడా ఇదే బ్యాన‌ర్ లో ఉండ‌బోతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొణిదెల బ్యాన‌ర్ లో బ‌య‌టి హీరో తొలిసారి న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. 

అత‌డే అఖిల్ అక్కినేని. ఈ కుర్ర హీరోను సొంత త‌మ్ముడులా భావిస్తుంటాడు చ‌ర‌ణ్. ఇప్పుడు త‌న నిర్మాణంలో ఓ క్రేజీ కాంబినేష‌న్ క‌ల‌పాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం బోయ‌పాటి శీనుతో విన‌య విధేయ రామ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్.. త్వ‌ర‌లోనే ఇదే ద‌ర్శ‌కుడితో అఖిల్ ను జత చేయాల‌ని చూస్తున్నాడు. విన‌య  విధేయ రామ టైమ్ లో బోయ‌పాటి వ‌ర్కింగ్ స్టైల్ న‌చ్చి ఇత‌డితో సినిమా నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. మ‌రోవైపు బాల‌య్య‌తో సినిమా అనుకున్నా కూడా ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో బోయ‌పాటికి బాల‌య్య దొర‌క‌డం క‌ష్ట‌మే. అందుకే అఖిల్ ను సెట్ చేసుకుంటున్నాడు ఈ మాస్ డైరెక్ట‌ర్. మొత్తానికి చూడాలిక‌.. చ‌ర‌ణ్-అఖిల్ క్రేజీ కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందో..? 

More Related Stories