English   

అరిపించిన అజిత్ విశ్వాసం మోష‌న్ పోస్ట‌ర్..

Ajith-Viswasam
2018-11-26 17:08:33

స్టార్ హీరోల‌కు ఇప్పుడు ఇండ‌స్ట్రీతో ప‌నిలేదు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని అంతా ఇప్పుడు ఒక్క‌టే అయిపోయారు. ఏ భాష‌లో సినిమా ఐనా ఎక్క‌డైనా ఆడేస్తుంది. దాంతో హీరోల‌కు గిరాకీ కూడా అలాగే ఉంది. అజిత్ కు అయితే మరీనూ. ఈయ‌న‌కు తెలుగులో కూడా ప‌డి చ‌చ్చిపోయే అభిమానులు ఉన్నారు. అప్ప‌ట్లో కొన్ని విజ‌యాలు వ‌చ్చాయి క‌దా అదే గుర్తింపు ఇంకా కొన‌సాగుతుంది. ఇక ఇప్పుడు ఈయ‌న కొత్త సినిమా విశ్వాసం సినిమా తెలుగులో కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర అప్ డేట్స్ కోసం ఇక్క‌డ కూడా అజిత్ అభిమానులు చూస్తున్నారు. ఇక ఇప్పుడు విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్ కు వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అజిత్ ఫాలోయింగ్ ఏంటో మ‌రోసారి అర్థ‌మైపోయింది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. చిన్న‌చిన్న ప్యాచ్ వ‌ర్కులు మాత్ర‌మే ఉన్నాయి. అవి కూడా డిసెంబ‌ర్ లో పూర్తి చేసి సంక్రాంతికి సినిమా విడుద‌ల చేస్తున్నారు. 100 కోట్లతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో అజిత్ పైలైట్ గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తుంది. 

నాలుగేళ్ల‌ కింద అజిత్ తో వీర‌మ్ చేసి సూప‌ర్ హిట్ అందుకున్నాడు శివ‌. తెలుగులో శౌర్యం, శంఖం, ద‌రువు లాంటి సినిమాలు చేసిన శివ‌.. త‌మిళ‌నాట సిరుత్తైతో పాపుల‌ర్ అయ్యాడు. ఆ త‌ర్వాత అజిత్ వీర‌మ్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అది మొద‌లు అజిత్ కు ఫ్యాన్ అయ్యాడు.. ఆ త‌ర్వాత ట్యూన్ అయ్యాడు. వ‌ర‌స‌గా ఆయ‌న‌తో సినిమాలు చేస్తున్నాడు. వీర‌మ్ అయిపోయింది.. వేద‌లం అయిపోయింది.. ఈ మ‌ధ్యే వివేగం కూడా అయిపోయింది. ఇది ఫ్లాపైంది. అయినా కానీ ఇప్పుడు నాలుగోసారి శివ‌తోనే సినిమాకు రెడీ అయ్యాడు అజిత్. ఈ కాంబినేష‌న్ కు మ‌రో ప్ర‌త్యేక‌థ కూడా ఉంది. వీళ్లు కేవ‌లం వి అనే అక్ష‌రంతోనే టైటిల్స్ పెట్టుకుంటారు పైగా చివ‌ర్లో సున్నా ఉంటుంది. వీర‌మ్.. వేదాలం.. వివేగం.. ఇప్పుడు విశ్వాసం అంటూ వ‌స్తున్నారు అజిత్, శివ‌. ఈ చిత్రంలో డ‌బుల్ రోల్ చేస్తున్నాడు అజిత్. మ‌రి చూడాలిక‌.. వివేగం ఫ్లాప్ బాకీ విశ్వాసంతో తీరుస్తాడో లేదో..? 

More Related Stories