English   

ఆ కోరిక తీర‌కుండానే వెళ్లిపోయిన అంబ‌రీష్.. 

Ambareesh
2018-11-26 18:33:37

అంబ‌రీష్ మృతికి ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల‌తో పాటు అభిమానులు కూడా సంతాపం తెలియ‌చేస్తున్నారు. ఆయ‌న క‌న్నుమూత క‌న్న‌డ సినిమాకు తీర‌నిలోటు అంటూ విల‌పిస్తున్నారు. అయితే ఈయ‌న 66 ఏళ్ల జీవితంలో దాదాపు అన్నీ చూసారు కానీ ఒక్క‌టి త‌ప్ప‌. ఆయ‌న త‌న‌యుడు హీరోగా మార‌డం మాత్రం చూడ‌లేకపోయారు అంబ‌రీష్. 26 ఏళ్ల అభిషేక్ అంబ‌రీష్ ను త్వ‌ర‌లోనే హీరోగా లాంఛ్ చేయాల‌ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా త‌న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు అంబ‌రీష్. ఈ ఏడాది కూడా రెండు సినిమాలు చేసాడు. అంత‌లోనే ఇలా అంద‌ర్నీ వ‌దిలేసి వెళ్లిపోవ‌డం బాధే. 

అయితే ఇప్పుడు అభిషేక్ ఎంట్రీపై వార్త‌లొస్తున్న త‌రుణంలోనే ఇలా అంబ‌రీష్ త‌నువు చాలించ‌డం పలువుర్ని కన్నీరు పెట్టిస్తుంది. ఇన్ని చేసిన ఈయ‌న కొడుకు హీరో అవ్వ‌డం చూడ‌లేక‌పోయాడే అంటూ పాపం అనుకుంటున్నారు. అయితే భ‌ర్త కోరిక‌ను ఇప్పుడు సుమ‌ల‌త తీర్చ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అంబ‌రీష్ కోరుకున్న విధంగానే అభిషేక్ క‌థ ఉండ‌బోతుంది. ఇప్ప‌టికే ఈయ‌న ఎంట్రీ కోసం ఏర్పాట్ల‌న్నీ జ‌రుగుతున్నాయి. అయితే ఇప్పుడు జ‌రిగిన విషాదంతో కొన్ని రోజులు ఈ సినిమా వార్త ప‌క్క‌కెళ్ల‌నుంది. కానీ వ‌చ్చే ఏడాది అంబ‌రీష్ వార‌సుడు క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. పై నుంచి తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయంటున్నాడు అభిషేక్ కూడా. 

More Related Stories