English   

నితిన్ కు అంత ధైర్యం ఎక్క‌డ్నుంచి వ‌స్తుంది..? 

Nithiin
2018-11-26 20:08:37

కంటెంట్ ఉంటే క‌టౌట్ ఏదైనా ప‌ర్లేదు అంటారు. కానీ కొంద‌రు మాత్రం కేవ‌లం కంటెంట్ కాకుండా క్రేజ్ న‌మ్ముకుంటారు. అప్పుడే బొక్క‌బోర్లా ప‌డ్తారు. కానీ మ‌ళ్లీ లేచి వెంట‌నే మ‌రోసారి బ్రాండ్ వెంటే ప‌రుగులు తీస్తుంటారు. నిండా మునిగిపోయేంత వ‌ర‌కు కూడా తాము మునిగిపోతున్నామ‌ని గ్ర‌హించ‌రు. ఇప్పుడు నితిన్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుది. ఈయ‌న కొంద‌రు ద‌ర్శ‌కులు, నిర్మాత‌ల బ్రాండ్ న‌మ్ముకుని మునిగిపోయాడు. అందుకే ఎప్పుడూ బ్రాండ్ నే కాదు.. అప్పుడ‌ప్పుడూ క‌థ‌ను కూడా న‌మ్ముకోవాలి. అలా చేసిన‌పుడు నితిన్ కు హిట్ వ‌చ్చింది. కానీ ఎప్పుడైతే బ్రాండ్ మోజులో ప‌డ్డాడో అప్ప‌ట్నుంచీ బ్యాండ్ మొద‌లైంది. కావాలంటే చూడండి.. 12 ఫ్లాపుల త‌ర్వాత నితిన్ కు హిట్ ఇచ్చింది స్టార్ డైరెక్ట‌ర్ కాదు.. అప్ప‌టికి తెలుగులో సినిమా చేసి 11 ఏళ్లైన విక్ర‌మ్ కే కుమార్. ఈ చిత్రం త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌యిందే అంటూ నితిన్ కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చింది విజ‌య్ కుమార్ కొండా అనే కొత్త ద‌ర్శ‌కుడు. 

కానీ పూరీ క‌థ న‌మ్మి ఎప్పుడైతే హార్ట్ ఎటాక్ చేసాడో అప్పుడే షాక్ తిన్నాడు. ఆ త‌ర్వాత కూడా క‌రుణాక‌ర‌ణ్ తో చిన్న‌దాన నీ కోసం చేసి చేతులు కాల్చుకున్నాడు. త్రివిక్ర‌మ్ ఒక్క‌డే నితిన్ కు హ్యాండివ్వ‌కుండా ఉన్నాడు. అ..ఆతో హిట్టిచ్చినా.. రైట‌ర్ గా మాత్రం షాక్ ఇచ్చాడు త్రివిక్ర‌మ్. ఈయ‌న రాసిన చ‌ల్ మోహ‌న్ రంగా నితిన్ కు ఫ్లాప్ ఇచ్చింది. దిల్ రాజు బ్యాన‌ర్ లో బ్రాండ్ న‌మ్ముకుని చేసిన శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా డిజాస్ట‌రే. ఈ చిత్రం త‌ర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు ఈ కుర్ర హీరోకు. అందుకే ఇప్పుడు కుర్ర ద‌ర్శ‌కుల వెంట ప‌డుతున్నాడు. ఇప్పుడు ఈయ‌న చేస్తున్న భీష్మ సినిమాకు ఛ‌లో ఫేమ్ వెంకీ కుడుముల ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం త‌ర్వాత కూడా కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య‌ప్రతాప్ తో సినిమా ఇప్ప‌టికే క‌మిట‌య్యాడు. ఇక ఈయ‌న‌తో పాటు ఇప్పుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటిని కూడా లైన్ లో పెట్టాడు. మ‌రి వీళ్ల‌లో నితిన్ కోరుకున్న విజ‌యం అందించే ద‌ర్శ‌కుడు ఎవ‌రో..? 

More Related Stories