English   

అక్క కోసం ఎన్టీఆర్.. పార్టీ కోసం బాల‌య్య‌..

NTR-Bala-krishna
2018-11-26 20:57:24

తెలుగుదేశం పార్టీలో సినిమా వాళ్ల‌కు కొద‌వేలేదు. ఆ పార్టీనే ఓ సినిమా అత‌డు పెట్టాడు క‌దా. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల స‌య‌మంలో ఆ పార్టీ నుంచి సినిమా వాళ్ల ప్ర‌చారం ఎక్కువ‌గా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే అన్న‌గారి పార్టీ కోసం అబ్బాయిలు క‌ష్ట‌ప‌డుతున్నారు. అక్క సుహాసినీ కోసం కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజుల పాటు వంతులు వేసుకుని మ‌రీ క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ప్ర‌చారం చేస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల నుంచి పార్టీకి దూరంగానే ఉన్న ఎన్టీఆర్.. అక్క కోసం రంగంలోకి దిగుతున్నాడ‌ని తెలుస్తుంది. 2009లో ఓడిపోయిన త‌ర్వాత అస‌లు మ‌ళ్లీ రాజ‌కీయాల వైపు కూడా రాలేదు ఈ హీరో. 

ఇక ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చింది. ఇప్ప‌టికే చంద్ర‌బాబు కూడా ఎన్టీఆర్ కు ఈ విష‌యంలో సూచ‌న‌లు ఇచ్చారని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే బాల‌య్య కూడా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల స‌మ‌రశంఖం పూరించ‌నున్నారు. ఈయ‌న కూడా న‌వంబ‌ర్ 30 నుంచి డిసెంబ‌ర్ 4 మ‌ధ్య‌లో ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ టిడిపి లీడ‌ర్స్ ర‌మ‌ణ‌తో పాటు ఇంకొంద‌రు బాల‌య్య‌ను క‌లిసారు.. మాట్లాడారు. వాళ్ల‌కు బాల‌య్య కూడా వ‌స్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ‌లో ఎలాగైనా పార్టీని నిల‌బెట్టాల‌ని త‌మవంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు టీడిపి నాయ‌కులు.. వాళ్ల‌కు తోడుగా అక్క‌కు అండ‌గా ఎన్టీఆర్.. బాబుకు అండ‌గా బాల‌య్య రానున్నారు. మరి వీళ్ల ప్ర‌చారం పార్టీకి ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

More Related Stories