English   

ప్రేక్ష‌కుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన అమీర్ ఖాన్..

Aamir-Khan
2018-11-27 11:25:26

ఈ రోజుల్లో సినిమా ఫ్లాప్ అయితే క‌నీసం న‌ష్టాలు ప‌ట్టించుకోవ‌డానికి కూడా హీరోల‌కు మ‌న‌సు రాదు. అలాంటిది బ‌య్య‌ర్ల‌కు ధైర్యం చెప్పి.. త‌న సినిమా ఫ్లాప్ అయినందుకు సారీ కూడా చెప్పే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అందులో అమీర్ ఖాన్ కూడా ఒక‌రు. ఈయ‌న న‌టించిన థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్ డిజాస్ట‌ర్ అయిపోయింది. 350 కోట్లు బిజినెస్ చేస్తే క‌నీసం 150 కోట్లు కూడా తీసుకురాలేదు ఈ చిత్రం. తొలిరోజే 50 కోట్లు తీసుకొచ్చి ఆ త‌ర్వాత పూర్తిగా డ‌ల్ అయిపోయింది. దివాళి సీజ‌న్ ను కూడా వాడుకోలేక చేతులెత్తేసింది. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ చిత్రం ఫ్లాప్‌ అవడం పూర్తిగా త‌న బాధ్య‌తే అని ఒప్పుకున్నాడు అమీర్ ఖాన్. ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు. థగ్స్‌ ఆఫ్‌ హిందుస్ధాన్‌ సినిమా ఫ్లాప్‌ అవడంపై పూర్తి బాధ్యత త‌న‌దే అని.. కానీ తాము మాత్రం శ‌క్తిమేర ప్ర‌య‌త్నించామ‌ని.. ఈ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులూ ఉన్నారని గుర్తు చేసాడు అమీర్ ఖాన్. 

వాళ్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూనే ఇష్టపడని ప్రేక్షకులు ఎందరో ఉన్నారు కాబట్టి అందులో త‌మ‌ ప్రయత్నంలోనే లోపం ఉందని ఒప్పుకున్నాడు అమీర్ ఖాన్. ముఖ్యంగా త‌న సినిమాలు థియేట‌ర్స్ లో చూడ్డానికి వ‌చ్చిన వాళ్లు ఎంట‌ర్ టైన్మెంట్ కోరుకుంటార‌ని.. ఈ సారి అది ఇవ్వ‌డంలో మిస్ అయినందుకు క్షమాపణలు చెబుతున్నానని చెప్పాడు అమీర్ ఖాన్. ఈ సినిమా త‌న‌ బిడ్డలాంటిదని.. అది విఫలమైంది కాబట్టి తాను కూడా విఫలమైనట్లే అని ఒప్పుకున్నాడు మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్. ఈ సినిమా వచ్చే నెలలో చైనాలో విడుదల కానుందని.. ఈ సినిమా చూశాక అక్కడి ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలైనా నిర్మొహమాటంగా పంచుకోవచ్చని చెప్పాడు. అంతేకాదు.. త‌న త‌ర్వాతి సినిమాకు మరింత కష్టపడి పనిచేస్తానని మాటిచ్చాడు అమీర్ ఖాన్. ఎంతైనా ఫ్లాప్ అయింద‌ని ఒప్పుకోవ‌డ‌మే గొప్ప అనుకుంటే క్ష‌మాప‌ణ చెప్ప‌డం మ‌రింత గొప్పే. 

More Related Stories