English   

ఈజిప్ట్ లో చిరు కోడ‌లు.. బాల‌య్య కూతురు.. 

Nara-Brahmani
2018-11-27 13:05:46

ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య స్నేహం ఎలా ఉందో.. వాళ్ల కుటుంబాల మ‌ధ్య కూడా అలాగే ఉంది. ఇంట్లో వాళ్లు కూడా చాలా స్నేహంగా ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి, చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన కలిసి ఈజిప్ట్ లో సందడి చేస్తున్నారు. అక్క‌డ వాళ్లు ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈజిప్టులో ఫేమస్ పిరమిడ్‌గా పేరొందిన గిజా పిరమిడ్ వద్ద తమ స్నేహితులతో కలిసి ఉపాసన, బ్రాహ్మణి సంద‌డి చేస్తున్నారు. చుట్టుప్రక్కల ఉన్న పలు చారిత్రిక ప్రదేశాలు తిరుగుతూ ఫోటోల‌కు పోజులు ఇస్తున్నారు. గ‌త మూడు నాలుగు రోజులుగా అక్క‌డే ఉన్న ఈ ఇద్ద‌రూ.. ఈజిప్టులో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం, చర్చించుకున్నాం అని ఈ ఫోటోల‌ను ట్విట్టర్ లో అప్ లోడ్ చేసింది ఉపాసన. ముందు నుంచి కూడా ఉపాసన, బ్రాహ్మణిలు మంచి స్నేహితులు. దీంతో ఇద్దరూ ఇలా సరదాగా బ‌య‌ట‌టికి వెళ్ల‌డం కూడా జ‌రుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసారు. అస‌లే ఇప్పుడు మెగా నంద‌మూరి కుటుంబాలు క‌లిసి మెలిసి ఉన్నాయి. పైగా రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ కూడా జ‌రుగుతుంది. ఇలాంటి టైమ్ లో ఈ రెండు కుటుంబాల నుంచి ఇద్ద‌రు అమ్మాయిలు ఇలా క‌లిసిమెలిసి ఉండ‌టం ఫ్యాన్స్ కు కూడా ఉత్సాహాన్నిస్తుంది. 

More Related Stories