English   

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డిన హీరోయిన్.. 

Gayathri-Raghuram
2018-11-27 14:41:54

తాగొద్దు.. తాగిన బ‌ళ్లు గ‌డపొద్దు.. వ‌చ్చినా రోడ్ల మీద‌కు రావ‌ద్దు అంటూ ఎవ‌రెన్ని చెప్పినా కూడా ఎవ‌రూ విన‌డం లేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు తాగి రోడ్ల మీద‌కు వ‌చ్చి నానా ర‌చ్చ చేస్తున్నారు. అందులో సామాన్య ప్ర‌జ‌లు ఉంటే ప‌ర్వాలేదు కానీ సెలెబ్రెటీలు కూడా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది స్టార్స్ అలా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా ఇలాగే దొరికింది. ప్రముఖ నటి, డాన్స‌ర్, బిగ్ బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు కూడా ఈమె విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసారు. చెన్నైలోని ఎంఆర్సీ నగర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో ఓ పార్టీకి వెళ్లింది గాయ‌త్రి. అక్క‌డ్నుంచి తిరిగి వ‌స్తున్న ఆమెను పోలీసులు త‌నిఖీ చేసారు. దాంతో ఫుల్లుగా తాగి ఉన్న గాయ‌త్రి పోలీసుల ముందు బ్రీత్ అనలైజర్ లోకి గాలిని తీసుకోగా.. ఆమె మోతాదుకు మించి మ‌ద్యం తీసుకున్నట్టు అంగీకరించింది. దాంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత మీడియా హ‌డావిడి కూడా పెరగ‌డంతో ఆమెను ఇంటిద‌గ్గ‌ర డ్రాప్ చేసి వాహ‌నాన్ని మాత్రం త‌మ ద‌గ్గరే ఉంచుకున్నారు. మొబైల్ కోర్టులో రూ. 3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు. ఏదేమైనా ఇలా స్టార్స్ మందు కొట్టి దొరికిపోతుంటే వాళ్ల‌ను ఫాలో అయ్యే ఫ్యాన్స్ ప‌రిస్థితి ఏంటి మ‌రి.?? 

More Related Stories