అల్లుడు కోసం ఆస్తులు అడిగిన ప్రియా వారియర్..

ఒక్కసారి కన్ను కొట్టినందుకే ఇండియా అంతా ఆమె జపమే చేసింది. ప్రియా వారియర్ అంటే ఇప్పుడు తెలియని వాళ్లంటూ ఉండరు. అంతగా ఫేమ్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క చిన్న వీడియోతో వైరల్ అయిపోయింది. సెలెబ్రెటీస్ కు కూడా ఎంతో కష్టపడితే రాని స్టార్ డమ్.. చాలా తక్కువ టైమ్ లో సంపాదించుకుంది ప్రియా. ఈమెను ఏకంగా నేషనల్ ఛానెల్స్ కూడా కూర్చోబెట్టి స్టార్ గా మార్చేసాయి. ఇక ఇప్పుడు ఈమె యాడ్స్ లో కూడా కుమ్మేస్తుంది. అఖిల్ తో కలిసి ఈ మధ్యే ఓ యాడ్ చేసింది ఇది కూడా సూపర్ హిట్ అయింది. ప్రియా వారియర్ ఒరు అడార్ లవ్ సినిమాతో పరిచయం అయింది. ఈ చిత్ర విడుదలకు ముందే స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకు అన్ని ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం డిగ్రీ చేస్తోన్న ఈ అమ్మాయి.. చదువుకుంటూనే ఈ సినిమాలో నటించింది. సుడి కలిసొచ్చి ఒరు అడార్ లవ్ విడుదలకు ముందే ప్రియా పుణ్యమా అని ఈ చిత్రం రేంజ్ ఎక్కడికో వెళ్లింది. అయితే ఇప్పుడు ప్రియా వారియర్ ను మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో సినిమా కోసం అడిగితే ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అడిగిందని తెలుస్తుంది. దాంతో నోరెళ్లబెట్టడం దర్శక నిర్మాతల వంతయింది. ఇప్పుడు ప్రియా వైపు చూడాలా వద్దా అని ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. పులివాసు దర్శకుడు. కొత్త నిర్మాత రిజ్వాన్ నిర్మిస్తున్నాడు. మరి ఇప్పుడే ప్రియా వారియర్ ఇంత డిమాండ్ చేస్తే రేపు రెండు మూడు విజయాలు వస్తే ఆస్తులు కావాలంటుందేమో..?